logo

ఇంటి నుంచి వచ్ఛి. విగతజీవిగా మారి

ఓ ఇంటర్‌ విద్యార్థిని చెరువులో విగతజీవిగా కనిపించిన ఘటన మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్‌లో శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానిక సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సై రాజేష్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Published : 22 May 2022 06:34 IST

మెదక్‌ జిల్లాలో ఇంటర్‌ విద్యార్థిని మృతదేహం లభ్యం

రామాయంపేట, బీబీపేట, న్యూస్‌టుడే: ఓ ఇంటర్‌ విద్యార్థిని చెరువులో విగతజీవిగా కనిపించిన ఘటన మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్‌లో శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానిక సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సై రాజేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. భిక్కనూర్‌ మండలంలోని ఓ గ్రామానికి బాలిక(17) ఇటీవలే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసింది. రామాయంపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదివింది. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబీకులు శనివారం భిక్కనూరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై-2 అహ్మద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కోనాపూర్‌లోని ఊరచెరువులో మృతదేహాన్ని గుర్తించిన గొర్రెలకాపరులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. రామాయంపేట ఎస్సై రాజేష్‌ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. విద్యార్థిని వివరాలు తెలుసుకొని తల్లిదండ్రులకు విషయం తెలిపారు.వెంటనే వారుచేరుకొని మృతదేహాన్ని పరిశీలించి తమ కూతురేననిబోరున విలపించారు.అనంతరం మృతురాలి తండ్రిఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని రామాయంపేటఆసుపత్రికి తరలించారు. బంధువులు, గ్రామస్థులు పెద్దఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు.

కారకులను శిక్షించాలని ఆందోళన..

తన కుమార్తె మృతికి స్వగ్రామానికి చెందిన ఓ యువకుడు, మెదక్‌ జిల్లా నార్సింగికి చెందిన మరో యువకుడు కారణమని మృతురాలి తండ్రి ఆరోపించారు. అసభ్య చిత్రాలు తీసి వేధించారని పేర్కొన్నారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు పంచనామా చేయనివ్వమని విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్థులు పట్టుబటారు. రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులువారికి నచ్చజెప్పారు. విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని