logo

‘న్యాయం చేస్తేనే మృతదేహం తీసుకెళ్తాం’

న్యాయం చేస్తేనే మృతదేహాన్ని తీసుకెళతామంటూ బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. శుక్రవారం గైక్వాడ్‌ చందు, లస్కరే గౌతం, రెడ్యా రాందాస్‌ పని ముగించుకొని హంగర్గాఫారం వెళుతున్నారు. ఇసుక ఖాళీ చేసిన ట్రాక్టర్‌ తిరిగి

Published : 22 May 2022 06:41 IST


మృతదేహంతో రోడ్డుపై బైఠాయించిన బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు

కోటగిరి, (రుద్రూర్‌), న్యూస్‌టుడే: న్యాయం చేస్తేనే మృతదేహాన్ని తీసుకెళతామంటూ బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. శుక్రవారం గైక్వాడ్‌ చందు, లస్కరే గౌతం, రెడ్యా రాందాస్‌ పని ముగించుకొని హంగర్గాఫారం వెళుతున్నారు. ఇసుక ఖాళీ చేసిన ట్రాక్టర్‌ తిరిగి సుంకినికి వెళుతోంది. కోటగిరి మండలం హంగర్గా ఫారం సమీపంలో ట్రాక్టర్‌ .. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో చందు దుర్మరణం చెందారు. తీవ్ర గాయాలపాలైన గౌతం, రాందాస్‌ను స్థానికులు అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. న్యాయం జరిగే వరకు ఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని తీసేది లేదని శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులంతా కలిసి రోడ్డుపై షామియానా వేసి నిరసన వ్యక్తం చేశారు. ఇరువైపులా రోడ్డును నిర్బందించారు. ఎస్సై రాము వారిని సముదాయించినా వినిపించుకోలేదు. ఇరువర్గాల పెద్దలు చొరవ తీసుకొని రాజీ చేసుకున్నారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని బోధన్‌ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని