logo

టమాట.. వేట

టమాట అన్నదాతకు ఎప్పుడూ గుండెకోతే మిగులుస్తోంది. జిల్లాలో ఏటా వేసవిలో సుమారు 400 ఎకరాల్లో పండిస్తారు. నెల కిందట కిలో రూ.2 కూడా పలకలేదు. కనీసం తెంపిన ఖర్చులు కూడా

Published : 23 May 2022 05:03 IST

న్యూస్‌టుడే, నందిపేట్‌ గ్రామీణం: టమాట అన్నదాతకు ఎప్పుడూ గుండెకోతే మిగులుస్తోంది. జిల్లాలో ఏటా వేసవిలో సుమారు 400 ఎకరాల్లో పండిస్తారు. నెల కిందట కిలో రూ.2 కూడా పలకలేదు. కనీసం తెంపిన ఖర్చులు కూడా రాకపోవడంతో రైతుల చేలల్లోనే కాయలను వదిలేశారు. ఏదో ఒక సమయంలో భారీగా ఎండలు కాసినప్పుడో, వర్షాలు పడ్డప్పుడో లేదా కాత చివరి దశలో ఉన్నప్పుడో ధర అమాంతం ఎగబాకుతుంది. ఈ ఏడాది కూడా అదే పునరావృత్తమైంది. పక్షం రోజుల కిందట టమాట కిలో ధర మార్కెట్‌లో రూ.5 ఉండేది. ఇప్పుడు అదే పంట కిలో రూ.60 పెట్టి కొనాల్సి వస్తోంది. కష్టపడి పండించిన పంట ఏపుగా పెరిగి జోరుగా కాత వచ్చినప్పుడు ధర లేకపోగా కోత చివరి దశకు వచ్చే సరికి ఆకాశాన్నంటిందని నందిపేట్‌ మండలం అయిలాపూర్‌కు చెందిన మంగళి పోశెట్టి అనే రైతు ‘న్యూస్‌టుడే’తో తన గోడు వెల్లబోసుకున్నారు. మరో నీటి తడి ఇస్తే ఎంతో కొంత కాత వచ్చి పెట్టుబడి ఖర్చులైనా మిగులుతాయని చివరి ప్రయత్నంగా టమాట వేట ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని