logo

బాన్సువాడలో భారీ చోరీ

పట్టణంలోని చైతన్యకాలనీలోని ఇంటి తాళం పగులగొట్టి రూ.29.40 లక్షలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. వివరాల ప్రకారం...తన కుటుంబ సభ్యులతో కలిసి విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు

Published : 24 May 2022 04:04 IST

చైతన్యకాలనీలో చోరీ జరిగిన ఇంటిని పరిశీలిస్తున్న సీఐ రాజశేఖర్‌రెడ్డి

బాన్సువాడ, న్యూస్‌టుడే: పట్టణంలోని చైతన్యకాలనీలోని ఇంటి తాళం పగులగొట్టి రూ.29.40 లక్షలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. వివరాల ప్రకారం...తన కుటుంబ సభ్యులతో కలిసి విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు వీరగంధం నాగేశ్వరరావు ఈ నెల 22వ తేదీ ఉదయం కోటగిరి మండలం ఎక్లాస్‌పూర్‌ క్యాంపులో మేనకోడలు పుట్టుపంచలు ఉండటంతో వెళ్లారు. అదే రోజు రాత్రి పది గంటలకు వచ్చే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా రూ.29.40 లక్షల నగదు అహపరించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అల్లుడు రాము ఇటీవల మహబూబ్‌నగర్‌లో వ్యవసాయ భూమి విక్రయించగా వచ్చిన నగదును ఇంట్లో పెట్టినట్టు బాధితుడు తెలిపారు. ఘటనా స్థలాన్ని బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి, సీఐ రాజశేఖర్‌రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని