logo

తల్లడిల్లుతోంది భూతల్లి

మనిషి అన్ని పోషకాలు సమంగా తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాడు. ఏది ఎక్కువైనా, తక్కువైనా శరీరం చెప్పిన మాట వినదు.. పంట నేలలనూ ఇలా సాకితేనే ప్రయోజనం ఉంటుంది. అన్ని రకాల ఎరువులు అవసరమైనంత తీసుకుంటేనే నాణ్యమైన దిగుబడులనిస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న భూములు నిస్సారమైపోయాయి. ప్రధాన పోషకాలైన నత్రజని(యూరియా), భాస్వరం, పొటాష్‌ సక్రమంగా

Published : 24 May 2022 05:44 IST

 పరిమితికి మించి పేరుకుపోయిన భాస్వరం నిల్వలు

 నిస్సారమైన ఉమ్మడి జిల్లా నేలలు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం

మనిషి అన్ని పోషకాలు సమంగా తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాడు. ఏది ఎక్కువైనా, తక్కువైనా శరీరం చెప్పిన మాట వినదు.. పంట నేలలనూ ఇలా సాకితేనే ప్రయోజనం ఉంటుంది. అన్ని రకాల ఎరువులు అవసరమైనంత తీసుకుంటేనే నాణ్యమైన దిగుబడులనిస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న భూములు నిస్సారమైపోయాయి. ప్రధాన పోషకాలైన నత్రజని(యూరియా), భాస్వరం, పొటాష్‌ సక్రమంగా లేక నేల స్వభావాన్ని పూర్తిగా మార్చేశాయి. ప్రస్తుతం వానాకాలం సీజన్‌ మొదలవుతున్న నేపథ్యంలో... ఏ ఎరువు ఎంత వేయాలి? అనే అంశంపై నిపుణులతో మాట్లాడి ‘న్యూస్‌టుడే’ విశ్లేషనాత్మక కథనం...

ఇలా చేద్దాం..

* నేల చౌడు(క్షార) లక్షణం కలిగి ఉంటే నిర్ణీత మోతాదులో జిప్సం వేసి బాగు చేయాలి. సేంద్రియ ఎరువులు ఎక్కువగా వేయాలి. లేదంటే పచ్చిరొట్ట పైరు ఏపుగా పెంచి చేనులో కలియదున్నాలి.
* తెల్ల చౌడు(పాల చౌడు) లవణ పరిమాణం ఎక్కువగా ఉన్న నేలలుంటే బాగా దున్ని మంచి నీటితో మడులు కట్టి 24 గంటల తర్వాత మురుగు కాల్వల ద్వారా బయటకు తీయాలి. ఇలా 4-5 సార్లు చేస్తే లవణాలు నీటిలో కరిగి నేల మాములు స్థితికి వస్తుంది.
* ఆమ్ల నేలలుంటే శాస్త్రవేత్తల సూచనల మేర సున్నం వేసి కలియదున్నాలి. వీటిలో అధికారుల సలహాల మేరకు తగిన పంటలేయాలి.
* వరికి నత్రజని ఎరువును 3-4 దఫాలుగా వేయాలి. మిగతా ఆరు తడిపంటలకు రెండు సార్లు వేస్తే సరిపోతుంది.
* భాస్వరాన్ని వేయాల్సి వస్తే మొత్తం ఆఖరి దుక్కిలోనే వేయాలి. పైపాటుగా మాత్రం వేయరాదు.
* పొటాష్‌ను నిర్ణీత మోతాదులో సగం ఆఖరు దుక్కిలో.. మిగతా సగం పూత దశకు ముందు వేయాలి.
* జింక్‌ను మాత్రం ప్రతి పంటకు 20 కిలోల చొప్పున వేసుకుంటే మంచిది. 



శాస్త్రవేత్తల సలహాల మేరకు సిఫారసు చేసిన ఎరువుల మోతాదు (కిలోలు/ఎకరానికి)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని