logo

పల్లెప్రగతికి ప్రణాళికల రూపకల్పన : జిల్లా పాలనాధికారి

జూన్‌ 3 నుంచి 17వ తేదీ వరకు కొనసాగనున్న పల్లెప్రగతి కార్యక్రమానికి ప్రణాళికలు రూపొందించాలని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో అధికారులతో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు

Published : 24 May 2022 05:34 IST

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జూన్‌ 3 నుంచి 17వ తేదీ వరకు కొనసాగనున్న పల్లెప్రగతి కార్యక్రమానికి ప్రణాళికలు రూపొందించాలని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో అధికారులతో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వందశాతం లక్ష్య సాధన దిశగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వైకుంఠధామాల్లో నీరు, విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకంగా ఎంపిక చేసిన 139 గ్రామ పంచాయతీల పరిధిలో బృహత్‌ పల్లెప్రకృతి వనాలను ఆకర్షణీయంగా మార్చాలన్నారు. ఆసరా పింఛన్లకు అర్హులైన వారి వివరాలు సేకరించాలని, చనిపోయిన వారి పేర్లు తొలగించాలని చెప్పారు. మన ఊరు- మన బడి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంశాలపై పలు సూచనలు చేశారు. అదనపు పాలనాధికారులు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని