logo

అగ్గువకే మడిగెలు ఇవ్వాలట..

నగరంలోని ఖలీల్‌వాడి, తిలక్‌గార్డెన్‌ సముదాయంలోని మడిగెలవి. ఇక్కడ మొత్తం 66 దుకాణాలు ఉన్నాయి. అందులో మూడు మడిగెల యజమానులు సరిగా అద్దె చెల్లించట్లేదు. అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందన లేదు.

Published : 24 May 2022 05:44 IST

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నగరం

దుకాణాల సముదాయం

నగరంలోని ఖలీల్‌వాడి, తిలక్‌గార్డెన్‌ సముదాయంలోని మడిగెలవి. ఇక్కడ మొత్తం 66 దుకాణాలు ఉన్నాయి. అందులో మూడు మడిగెల యజమానులు సరిగా అద్దె చెల్లించట్లేదు. అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందన లేదు. ఒక్కో దాని ద్వారా రూ.9 లక్షల వరకు అద్దె రావాల్సి ఉంది. దీంతో వాటిని రద్దు చేసి కొత్తగా టెండర్‌ వేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
అధికారులపై ఒత్తిడి.. : నగరానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్త వాటిలో ఓ దుకాణం తనకు కేటాయించాలని కోరుతున్నారు. ఆయనకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు నగరానికి చెందిన మరో నేత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పాత ఒప్పందాన్ని రద్దు చేసి ఆయన పేరుపై మార్చాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
నిబంధనల ప్రకారం.. : ఏదైనా పరిస్థితిలో మడిగె ఖాళీ అయితే మేయర్‌ అనుమతి మేరకు అధికారులు అద్దెకు ఇస్తారు. మడిగె కిరాయి, దరఖాస్తు ఫీజు, ప్రభుత్వానికి చెల్లించే సొమ్ము వంటి వివరాలతో పత్రికలో నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. టెండర్‌ వేసే ఆఖరి రోజుని నోటీసులో తెలియజేస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన దాని కంటే ఎవరు ఎక్కువ సొమ్ము, అద్దె చెల్లించడానికి ముందుకొస్తారో వారికి దుకాణం కేటాయిస్తారు.
ఎందుకోసమంటే.. : దుకాణాలను తీసుకున్న తర్వాత వాటిని అధిక ధరలకు ఇతరులకు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కూడా ఇతరులకు ఇచ్చుకోవచ్చని భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో పత్రికలో నోటిఫికేషన్‌ లేకుండా అంతర్గతంగా ప్రక్రియ పూర్తి చేయించాలని చూస్తున్నారు. పలుమార్లు అధికారులతో వాదనకు దిగారు. ఈ విషయమై ‘న్యూస్‌టుడే’ నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌ రవిబాబును వివరణ కోరగా.. ‘ఖాళీగా ఉన్న మూడు మడిగెలను నిబంధనల మేరకే కేటాయిస్తాం. నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.’

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని