logo

డిగ్రీతోనే కలల కొలువు

బీటెక్‌, ఎంటెక్‌ చదవకున్నా డిగ్రీ మూడో ఏడాదిలో ఉండగానే ఐదంకెల వార్షిక జీతం కలిగిన ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. జిల్లా యువకులు ప్రాంగణ నియామకాల్లో ప్రతిభ చాటుతున్నారు. ఇటీవల కళాశాలలకు ప్రముఖ సంస్థల ప్రతినిధులు వచ్చి మౌఖిక పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల సామర్థ్యాన్ని

Published : 24 Jun 2022 06:11 IST

 ప్రాంగణ నియామకాల్లో ప్రతిభ
ముందుకొస్తున్న ఆయా సంస్థలు

బీటెక్‌, ఎంటెక్‌ చదవకున్నా డిగ్రీ మూడో ఏడాదిలో ఉండగానే ఐదంకెల వార్షిక జీతం కలిగిన ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. జిల్లా యువకులు ప్రాంగణ నియామకాల్లో ప్రతిభ చాటుతున్నారు. ఇటీవల కళాశాలలకు ప్రముఖ సంస్థల ప్రతినిధులు వచ్చి మౌఖిక పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నారు. సంస్థలో వచ్చే ఆటుపోట్లు, ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులతో సంబంధాల నిర్వహణ తదితర అంశాల్లో పరీక్షిస్తున్నారు. చురుగ్గా ఉన్న వారిని ఎంపిక చేసుకొని ఉద్యోగాలకు అవసరమైన కోర్సుల్లో వారే శిక్షణ అందిస్తున్నారు.
ఫలిస్తున్న  టాస్క్‌ సదస్సులు
డిగ్రీ విద్యార్థులకు టాస్క్‌ ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రతి కళాశాలలో ఒక శిక్షకుడిని నియమించారు. వారి ద్వారా ఆయా అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆంగ్లంపై పట్టు పెంపొందించుకునేలా మెలకువలు సూచిస్తున్నారు. సమకాలీన అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు తెలియజేస్తున్నారు.
ఇప్పటికే వందలాది మంది ఎంపిక
ఐదేళ్లుగా జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో ప్రముఖ సంస్థలు నిర్వహిస్తున్న ప్రాంగణ నియామకాల ద్వారా ఇప్పటికే 350 మంది ఎంపికయ్యారు. వీరికి ప్రారంభంలో రూ.15 వేల- 18 వేల వరకు వేతనం ఉండగా.. అనుభవం ఆధారంగా రూ.35 వేల వరకు అందుకుంటున్నారు. సాధారణ డిగ్రీ చదువులతో అనేక మంది సాఫ్ట్‌వేర్‌ ఇతర కొలువులు సాధిస్తున్నారు. కొద్దిమంది ప్రాంగణ నియామకాల్లో ఎంపికైనా ఉన్నత చదువుల వైపే ఆసక్తి చూపుతున్నారు.


సామాజిక విషయాలపై అవగాహన
- సుస్మిత, ఎంఎస్‌టీసీఎస్‌, తృతీయ సంవత్సరం

చదువులతో పాటు సామాజిక విషయాలపై అవగాహన ఉండటంతో ఇటీవల నిర్వహించిన ఉద్యోగ మేళాలో ప్రతిభచాటా. సంస్థ నిర్వహణ, లోపాలు ఎదురైనప్పుడు సవాళ్లను ఎలా స్వీకరించాలో మౌఖిక పరీక్షలో విశదీకరించా. ప్రాంగణ నియామకాల్లో ఎంపిక కావడానికి ఇదే దోహదపడింది.


సమకాలీన అంశాలపై పట్టుతోనే
- శ్రుతి, బీకాం సీఏ, తృతీయ సంవత్సరం

ఇంటర్మీడియెట్‌ నుంచే సమకాలీన అంశాలపై పట్టు పెంచుకుంటున్నా. ఇటీవల నిజామాబాద్‌లో ఒమెగా హెల్త్‌కేర్‌ సంస్థ నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యా. ఏడాదికి రూ.3 లక్షల వేతనం ఇస్తామని చెప్పారు. డిగ్రీతోనే మెరుగైన ఉద్యోగం సాధించడం ఆనందాన్ని నింపింది.


నడవడికను గమనించారు
- గీతాశ్రీ, బీకాం సీఏ, తృతీయ సంవత్సరం

రాత పరీక్షలో ఎంపికైన వారికి మౌఖిక పరీక్ష  నిర్వహించారు. అందులో ముఖ్యంగా సంస్థ    ప్రతినిధులు నడవడికను నిశితంగా పరిశీలించారు. మాట  తీరు, ముప్పులను అధిగమించే  శక్తిసామర్థ్యాలు ఉన్నాయా అని ఆరా తీశారు. తొలి ప్రయత్నంలోనే ఐదంకెల వార్షిక జీతంతో ఎంపికవడం నాలో   ఆత్మస్థైర్యం నింపింది.


మౌఖిక పరీక్ష కీలకమే
- దేవరాజు, బీకాం సీఏ, తృతీయ సంవత్సరం

ప్రాంగణ నియామకాల్లో రాత పరీక్షకన్నా మౌఖిక పరీక్షే కీలకం. ఆంగ్ల భాషలో నైపుణ్యం, సమయపాలన, భావ వ్యక్తీకరణ అంశాలు పరిశీలించారు. నిమిషానికి ఆరు ప్రశ్నలు వేశారు. ఐదింటికి సమాధానాలు ఇచ్చా. డిగ్రీ పూర్తవ్వగానే ప్రముఖ సంస్థలో పని చేసే అవకాశం రావడం ఆనందం కలిగించింది.


ఆంగ్ల భాషలో నైపుణ్యంతోనే ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యా. వేతనం ఎంతైనా మొదట అనుభవం వస్తే భవిష్యత్తులో రాణించే వీలుంటుంది. డిగ్రీ అనంతరం ఉన్నత చఆంగ్లంలో నైపుణ్యంతో..
- చందన, బీకాం, ఎంఎస్‌టీసీఎస్‌, తృతీయ సంవత్సరంద


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని