logo

మార్పు కోరుతూ దేశయాత్ర

దేశంలో సమూల మార్పు కోసం, దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కోరుతూ బిహార్‌కు చెందిన సామాజిక కార్యకర్త వినయ్‌కుమార్‌ కాలినడకన దేశయాత్ర చేపట్టారు.

Published : 24 Jun 2022 06:25 IST

భిక్కనూరు, న్యూస్‌టుడే: దేశంలో సమూల మార్పు కోసం, దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కోరుతూ బిహార్‌కు చెందిన సామాజిక కార్యకర్త వినయ్‌కుమార్‌ కాలినడకన దేశయాత్ర చేపట్టారు. గురువారం భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులోని 44వ జాతీయ రహదారిపై భారత పతాకాన్ని పట్టుకొని వెళ్తున్న ఆయన్ను ‘న్యూస్‌టుడే’ పలకరించింది. ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది జనవరి 26న బిహార్‌ రాజధాని పట్నాలో ప్రారంభించిన పాదయాత్ర బెంగాల్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లను దాటి తెలంగాణలో ప్రవేశించానన్నారు. గ్రామ పంచాయతీ నుంచి చట్ట సభల వరకు ప్రజాప్రతినిధుల్లో 80శాతం యువత ఉండాలని ఆకాంక్షించారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానం తీసుకురావాలన్నారు. ఆయన వెంట ఇద్దరు సహాయకులు తోడుగా ఉన్నారు. ఇప్పటికే సుమారు 7,500 కిలోమీటర్ల పాదయాత్ర చేయగా మొత్తం 17 వేల కి.మీ. నడవనున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని