logo

రాయలసీమ ట్రయల్‌ రన్‌

మాబాద్‌-తిరుపతి మధ్య నడిచే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైలును నిజామాబాద్‌-బోధన్‌ మధ్య ప్రయోగాత్మకంగా నడిపారు. గురువారం ఉదయం 10:30 బయల్దేరిన రైలు 11:30కు బోధన్‌ చేరుకుంది.

Published : 24 Jun 2022 06:25 IST

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే : నిజామాబాద్‌-తిరుపతి మధ్య నడిచే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైలును నిజామాబాద్‌-బోధన్‌ మధ్య ప్రయోగాత్మకంగా నడిపారు. గురువారం ఉదయం 10:30 బయల్దేరిన రైలు 11:30కు బోధన్‌ చేరుకుంది. బోగీలు శుభ్రం చేయించాక 12:30కు నిజామాబాద్‌ బయల్దేరింది. కొన్నాళ్లుగా దీన్ని బోధన్‌ వరకు పొడిగించాలని డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా నడిపి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. భద్రత, పట్టాల సామర్థ్యం, పారిశుద్ధ్య పనులు తదిర ఐదు రకాల సాంకేతిక అంశాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నారు. అనంతరం పొడిగింపుపై నిర్ణయం వెలువడుతుంది. రైలు రావడంతో పలువురు స్టేషన్‌కు రాగా అనుమతి లేదనడంతో వెనుదిరిగారు. సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ ఉదయ్‌కుమార్‌, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ అవినాష్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని