logo

సరిహద్దు భూమి విషయంలో.. ఇరుగ్రామాల మధ్య ఘర్షణ

భీమ్‌గల్‌ మండలంలోని పిప్రి, సిరికొండ మండలం జంగిలోడితండా పరిధిలోని చింతల్‌తండా గ్రామాల మధ్య వివాదాస్పద భూమి విషయమై సోమవారం ఘర్షణ జరిగింది

Published : 28 Jun 2022 06:29 IST

పరస్పర దాడులకు పాల్పడుతున్న పిప్రి, చింతల్‌తండా గ్రామస్థులు

సిరికొండ, న్యూస్‌టుడే: భీమ్‌గల్‌ మండలంలోని పిప్రి, సిరికొండ మండలం జంగిలోడితండా పరిధిలోని చింతల్‌తండా గ్రామాల మధ్య వివాదాస్పద భూమి విషయమై సోమవారం ఘర్షణ జరిగింది. పిప్రి గ్రామస్థులు ఆ భూమిలో ట్రాక్టర్లతో చదును చేసి విత్తనాలు నాటుతున్నారని చింతల్‌తండా వాసులకు తెలియడంతో అడ్డుకోవడానికి వెళ్లారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో చింతల్‌తండాకు చెందిన తొమ్మిది మందికి, పిప్రి గ్రామానికి చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి. వారందరిని ఆసుపత్రులకు తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో భీమ్‌గల్‌ పోలీస్‌స్టేషన్‌లో పిప్రి గ్రామస్థులు, సిరికొండ ఠాణాలో చింతల్‌తండా వాసులు ఫిర్యాదులు చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో తండావాసులు ధర్నా చేశారు. కాగా సరిహద్దు విషయమై పలుమార్లు జిల్లాస్థాయి అధికారులు సర్వే చేసి హద్దులు నిర్ణయించినా ఇరువర్గాలు అంగీకరించకపోవడంతో సమస్య పరిష్కారం కావట్లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని