logo

వైద్యానికి వెళ్తే.. బంగారం చోరీ

తీవ్ర అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన రోగి బంగారం మాయమైన ఘటన నిజామాబాద్‌లో జరిగింది. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అందులోని వివరాల ప్రకారం..

Published : 28 Jun 2022 06:38 IST

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తీవ్ర అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన రోగి బంగారం మాయమైన ఘటన నిజామాబాద్‌లో జరిగింది. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అందులోని వివరాల ప్రకారం.. ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన అత్తినినేని రాజు.. తన తల్లి లక్ష్మి ఆరోగ్యం బాగాలేకపోవడంతో మనోరమ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆ సమయంలో లక్ష్మి చెవులకు 14 మాసాల బంగారు కమ్మలు, మాటీలు ఉన్నాయి. ఉదయం చూసేసరికి అవి మాయమయ్యాయి. ‘ఈ విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా సరిగా స్పందించట్లేదు. బంగారం పోవడంతో పాటు చికిత్స కోసం రూ.4 లక్షలు చెల్లించానని’ బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో జిల్లా పాలనాధికారి స్పందించి విచారణకు ఆదేశించారు. ‘ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై విచారణ చేయిస్తాం. యాజమాన్యంతో మాట్లాడతాం. బంగారం చోరీ జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని’ జిల్లా వైద్యాధికారి, సుదర్శనం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని