logo

దేశాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

దేశాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని కేంద్ర రక్షణ, పర్యాటకశాఖ సహాయ మంత్రి అజయ్‌భట్‌ పేర్కొన్నారు. చేపూర్‌లోని క్షత్రియ ఇంజినీరింగ్‌ కళాశాలను శనివారం ఆయన సందర్శించారు. పండిత్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ విగ్రహానికి పూలమాల వేశారు.

Published : 03 Jul 2022 03:21 IST

ఎన్‌సీసీ కెడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న కేంద్ర మంత్రి అజయ్‌ భట్‌

ఆర్మూర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: దేశాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని కేంద్ర రక్షణ, పర్యాటకశాఖ సహాయ మంత్రి అజయ్‌భట్‌ పేర్కొన్నారు. చేపూర్‌లోని క్షత్రియ ఇంజినీరింగ్‌ కళాశాలను శనివారం ఆయన సందర్శించారు. పండిత్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం కళాశాలలో ఎన్‌సీసీ కెడెట్ల గౌరవ వందనం స్వీకరించి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కళాశాల ఛైర్మన్‌ అల్జాపూర్‌ శ్రీనివాస్‌, భాజపా రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, కళాశాల వైస్‌ఛైర్మన్‌ లక్ష్మీనారాయణ, కోశాధికారి గంగాధర్‌, కార్యదర్శి దేవేందర్‌, ప్రిన్సిపల్‌ పాండె, వైస్‌ ప్రిన్సిపల్‌ నరేందర్‌, నాయకులు నర్సింహారెడ్డి, భూపతిరెడ్డి, గంగాధర్‌, వినయ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అనిల్‌కుమార్‌, రాజు, విజయ్‌, విజయానంద్‌, వేణు, ఉదయ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని