logo

ఇంటిని ఎత్తిపెట్టారు

వర్షాకాలంలో ఇంట్లోకి నీరు చేరుతుండటంతో ఓ యజమాని తన ఇంటిని ఐదు ఫీట్ల ఎత్తుకు లేపించారు. వడ్ల సత్యనారాయణ నగరంలోని దుబ్బ సాయిబృందావన్‌ కాలనీలో గతంలో ఇల్లు కట్టుకున్నారు. రానురాను రోడ్డు ఎత్తు కావడంతో ఏటా వర్షం నీరు ఇంటిలోకే వస్తోంది. దీంతో ఇంటి

Published : 03 Jul 2022 03:21 IST

వర్షాకాలంలో ఇంట్లోకి నీరు చేరుతుండటంతో ఓ యజమాని తన ఇంటిని ఐదు ఫీట్ల ఎత్తుకు లేపించారు. వడ్ల సత్యనారాయణ నగరంలోని దుబ్బ సాయిబృందావన్‌ కాలనీలో గతంలో ఇల్లు కట్టుకున్నారు. రానురాను రోడ్డు ఎత్తు కావడంతో ఏటా వర్షం నీరు ఇంటిలోకే వస్తోంది. దీంతో ఇంటి ఎత్తు పెంచాలని నిర్ణయించుకున్నారు. హరియాణాకు చెందిన ఓమ్‌సింగ్‌ చందన్‌ నేతృత్వంలో హౌజ్‌లిఫ్టింగ్‌ సర్వీస్‌కు పని అప్పగించారు. 120 గజాల ఇంటిని ఐదు ఫీట్ల మేర పైకి లేపడానికి రూ.2.16 లక్షలు ఖర్చయింది. 12 రోజుల సమయం పట్టింది.

- న్యూస్‌టుడే, నిజామాబాద్‌ అర్బన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని