logo

సరకు రవాణా.. నింపుతున్న ఖజానా

ఆర్టీసీ కార్గో సేవలు సంస్థకు ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో రూ.లక్షల్లో ఆదాయం తెచ్చిపెడుతోంది. ఇటీవల వినూత్న పథకాలతో ఆర్టీసీ ప్రజల ముందుకొస్తోంది. కార్గో ద్వారా బంగినిపల్లి మామిడిపండ్లు, భద్రాచలం నుంచి సీతారామ కల్యాణ

Published : 03 Jul 2022 03:21 IST

ఆర్టీసీకి కార్గో సేవలతో  రూ.5.84 కోట్ల రాబడి

న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

పార్సిళ్ల వివరాలను నమోదు చేయిస్తున్న ప్రజలు

ఆర్టీసీ కార్గో సేవలు సంస్థకు ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో రూ.లక్షల్లో ఆదాయం తెచ్చిపెడుతోంది. ఇటీవల వినూత్న పథకాలతో ఆర్టీసీ ప్రజల ముందుకొస్తోంది. కార్గో ద్వారా బంగినిపల్లి మామిడిపండ్లు, భద్రాచలం నుంచి సీతారామ కల్యాణ తలంబ్రాలను నమోదు చేసుకున్నవారికి తెప్పించి ఇచ్చారు. 2020 జూన్‌ 19న సేవలు ప్రారంభం కాగా రెండేళ్లలో 4,80,446 పార్సిళ్లు, కొరియర్లు చేరవేశారు. వీటి ద్వారా రూ.4.92 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక బస్సుల్లో సరకుల రవాణాకు ఉమ్మడి జిల్లాలో ఆయా డిపోల పరిధిలో 1,653 నమోదు కాగా రూ.92.15 లక్షల ఆదాయం సమకూరిందని అధికార వర్గాలు వెల్లడించాయి.


సద్వినియోగం చేసుకోవాలి

- లక్కు మల్లేశం, డీఎం, కామారెడ్డి

ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి సారించాం. అందులో భాగంగా తీసుకొచ్చిన కార్గో ద్వారా గణనీయమైన రాబడి వస్తోంది.  


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని