logo

మహారాష్ట్ర కోడె.. రూ.1.10 లక్షలు

రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన  సాటాపూర్‌ పశువుల సంత శనివారం కిక్కిరిసిపోయింది. సాధారణంగా ప్రతి శనివారం రూ.2 కోట్ల విలువ చేసే పశువుల క్రయవిక్రయాలు సాగుతుండగా ఈ సారి రూ.8 కోట్ల వ్యాపారం జరిగింది. పశువుల కొనుగోలు, అమ్మకం దాఖల చిట్టీల ద్వారా

Published : 03 Jul 2022 03:21 IST

రూ.1.10 లక్షలు పలికిన మహారాష్ట్ర ముద్‌ఖేడ్‌ తాలూకా డొంగర్‌గావ్‌కు చెందిన కోడె

సాటాపూర్‌(రెంజల్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన  సాటాపూర్‌ పశువుల సంత శనివారం కిక్కిరిసిపోయింది. సాధారణంగా ప్రతి శనివారం రూ.2 కోట్ల విలువ చేసే పశువుల క్రయవిక్రయాలు సాగుతుండగా ఈ సారి రూ.8 కోట్ల వ్యాపారం జరిగింది. పశువుల కొనుగోలు, అమ్మకం దాఖల చిట్టీల ద్వారా ప్రతి వారం పంచాయతీకి రూ.6 వేల ఆదాయం సమకూరనుండగా ఈ వారం రూ.42 వేలు సమకూరినట్లు పంచాయతీ కార్యదర్శి మహబూబ్‌అలీ పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన కోడెలకు అధిక డిమాండ్‌ ఏర్పడింది. ముద్‌ఖేడ్‌ తాలూకా డొంగర్‌గావ్‌కు చెందిన రైతు దత్తుపటేల్‌ కోడె ధర రూ.1.10 లక్షలు, బిలోలి తాలుకా అజ్నీ గ్రామానికి చెందిన రైతు బాలాజీ తన కోడ ధర రూ. లక్షకు పైగా ప్రకటించగా.. కొనుగోలుదారులు పోటీపడి కొనుగోలు చేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని