logo

9 నుంచి జాతీయ జెండాల పంపిణీ

వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్రం ఆదేశించింది. అందులో భాగంగా ఈ నెల 9 నుంచి ఇంటింటికి జాతీయ జెండాను పంపిణీ చేసేందుకు నగర పాలక సంస్థ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Published : 08 Aug 2022 04:40 IST

నిజామాబాద్‌ నగరం, న్యూస్‌టుడే: వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్రం ఆదేశించింది. అందులో భాగంగా ఈ నెల 9 నుంచి ఇంటింటికి జాతీయ జెండాను పంపిణీ చేసేందుకు నగర పాలక సంస్థ అధికారులు ఏర్పాట్లు చేశారు. బల్దియా పరిధిలో ఐదు సర్కిళ్లు ఉండగా ఆరుగురు చొప్పున పర్యవేక్షణ అధికారులు, జోనల్‌ అధికారులను నియమించారు. ఇంజినీరింగ్‌, పారిశుద్ధ్యం, టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ, మెప్మా విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొంటారు. ఇదే విధంగా వజ్రోత్సవాల కార్యక్రమాల్లో మహిళా, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయనున్నారు.

అవసరమైన త్రివర్ణ పతాకాలు: 85 వేలు
డివిజన్లు : 60
జనాభా  : 3.99 లక్షలు
నివాసాలు : 79 వేలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని