logo

Telangana news : శునకమే గంగిరెద్దుగా..

గా గంగిరెద్దు వాళ్లు ఇళ్ల ముందుకు వచ్చి సొన్నాయి వాయించి గంగిరెద్దును ఆడించి భిక్షాటన చేస్తూ బతుకుదెరువు సాగిస్తుంటారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రం వినాయక్‌నగర్‌లో సన్నాయి....

Updated : 10 Aug 2022 11:12 IST

సాధారణంగా గంగిరెద్దు వాళ్లు ఇళ్ల ముందుకు వచ్చి సొన్నాయి వాయించి గంగిరెద్దును ఆడించి భిక్షాటన చేస్తూ బతుకుదెరువు సాగిస్తుంటారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రం వినాయక్‌నగర్‌లో సన్నాయి చప్పుడుకు బయటకు వచ్చిన ఇల్లాలు గంగిరెద్దు స్థానంలో కుక్కను చూసి ఆశ్చర్యపోయారు. అయినా ఆ ఇంటి సభ్యులు తోచిన సాయమందించారు. ఇదేంటని ఆ వ్యక్తిని ప్రశ్నించగా గంగిరెద్దులు దొరకడం లేదని, భిక్షాటనకు వెళ్లేందుకు తోడుంటుందని కుక్కను వెంట తెచ్చుకున్నట్లు పేర్కొన్నారు.

- ఈటీవీ, నిజామాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని