logo

ఆశకు పోయి సైబర్‌ మోసాలకు గురికావొద్దు

సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్శి రాములు కల్యాణ మండపంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సైబర్‌ కాంగ్రెస్‌కు ఆయన

Updated : 12 Aug 2022 03:41 IST

విద్యార్థులతో కలిసి అవగాహన పుస్తకాలు విడుదల చేస్తున్న కలెక్టర్‌ పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు

కామారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్శి రాములు కల్యాణ మండపంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సైబర్‌ కాంగ్రెస్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలు ఆశకు పోయి ఆర్థిక నష్టాలకు గురికావొద్దన్నారు. సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించడంలో జిల్లా పోలీసులు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. విద్యార్థులు పాఠ్య ప్రణాళికపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలన్నారు. ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. చరవాణులు, అంతర్జాల వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్‌ నేరాల సంఖ్య అధికమవుతోందన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసుశాఖ- ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అవగాహన కార్యక్రమంలో ఉత్తమ అంబాసిడర్లుగా ఎంపికైన వంశీ, ప్రజ్ఞ, రాజశ్రీలకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ప్రవాస భారతీయుడు ఇంద్రసేనారెడ్డి వీరు ముగ్గురికి రూ.25 వేల చొప్పున అందిస్తున్నట్లు ప్రకటించారు. డీఈవో రాజు, ఏఎస్పీ అన్యోన్య, డీఎస్పీ సోమనాథం, జిల్లా బాలరక్ష భవన్‌ సమన్వయకర్త జానకి, జీసీడీవో ఉమారాణి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని