logo

దళితులు వ్యాపారవేత్తలుగా ఎదగడమే లక్ష్యం

అన్నింటా వెనుకబడ్డ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని జడ్పీ ఛైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌ కార్యాలయ స్థాయీ సంఘాల

Published : 12 Aug 2022 03:23 IST

జడ్పీ స్థాయీ సంఘ సమావేశంలో మాట్లాడుతున్న ఛైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ

కామారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: అన్నింటా వెనుకబడ్డ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని జడ్పీ ఛైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌ కార్యాలయ స్థాయీ సంఘాల సమావేశ మందిరంలో గురువారం సాంఘిక, మహిళా, శిశు సంక్షేమం, వ్యవసాయంపై నిర్వహించిన సమావేశాల్లో ఆమె మాట్లాడారు. దళితులను వ్యాపారవేత్తలుగా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ పథకంలో మంజూరైన యూనిట్లను లబ్ధిదారులు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. వ్యవసాయంపై జరిగిన సమావేశానికి వైస్‌ ఛైర్మన్‌ ప్రేమ్‌కుమార్‌ అధ్యక్షత వహించారు. తాడ్వాయి, భిక్కనూరు, రాజంపేట, దోమకొండ జడ్పీటీసీ సభ్యులు రమాదేవి, పద్మ, హన్మాండ్లు, తిర్మల్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని