logo

కొత్త మండలంగా పాల్వంచ...!

జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటుకు రెవెన్యూశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త మండలాలను ప్రకటించడంతో జిల్లాలో కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. మాచారెడ్డి మండలంలోని

Published : 12 Aug 2022 03:23 IST

మాచారెడ్డి: పాల్వంచమర్రి వద్ద సీఎం కేసీఆర్‌, విప్‌ గోవర్ధన్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్న నాయకులు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటుకు రెవెన్యూశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త మండలాలను ప్రకటించడంతో జిల్లాలో కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. మాచారెడ్డి మండలంలోని పాల్వంచను ఏర్పాటు చేయాలని గ్రామస్థుల విన్నపం మేరకు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రభుత్వానికి నివేదించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆర్డీవో ఆధ్వర్యంలో రెవెన్యూ యంత్రాంగం ఈ నెల 10న ప్రభుత్వానికి సమర్పించారు.

తొమ్మిది గ్రామాలతో..
మాచారెడ్డి మండలంలో 19 రెవెన్యూ గ్రామాలుండగా ఇందులోని తొమ్మిదింటిని విభజించి పాల్వంచ కేంద్రంగా నూతన మండలం ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశమున్నట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి.

జిల్లావ్యాప్తంగా విన్నపాలు
ప్రభుత్వం ఇటీవలే మద్నూర్‌ మండలాన్ని విభజిస్తూ డోంగ్లీని కొత్త మండలంగా ఏర్పాటు చేసింది. నిజాంసాగర్‌ మండలం నుంచి మహ్మద్‌నగర్‌ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. లింగంపేట మండలంలోని షట్‌పల్లి సంగారెడ్డిని వేరు చేయాలని ఇటీవల గ్రామస్థులు తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదించారు. గాంధారిలోనూ రెండు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. గురువారం పాల్వంచమర్రిలో ఇన్‌ఛార్జి ఎంపీపీ నర్సింహారెడ్డి, జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, సర్పంచి సునీత, ఎంపీటీసీ సభ్యురాలు లావణ్య శేఖర్‌, సర్పంచుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చిట్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని