logo

ఎగరనిద్దాం స్వేచ్ఛగా..

దేశానికి వలస పాలకుల నుంచి విముక్తి లభించింది కానీ... స్త్రీ మాత్రం పురుషాధిక్య సమాజం నుంచి ఇంకా స్వాతంత్య్రం పొందలేదు... ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో తరచూ వినిపించే నిర్వేదపూరితమైన మాటలివి. మహిళను గౌరవించే

Updated : 12 Aug 2022 05:11 IST

స్వతంత్రతే... సోదరికిచ్చే బహుమతి

నేడు రాఖీ పౌర్ణమి

న్యూస్‌టుడే, ఇందూరు ఫీచర్స్‌

దేశానికి వలస పాలకుల నుంచి విముక్తి లభించింది కానీ... స్త్రీ మాత్రం పురుషాధిక్య సమాజం నుంచి ఇంకా స్వాతంత్య్రం పొందలేదు... ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో తరచూ వినిపించే నిర్వేదపూరితమైన మాటలివి. మహిళను గౌరవించే సంప్రదాయం మనది.  అలా ఆచరించే వేడుకల్లో సోదర, సోదరీమణులు నిర్వహించుకొనే రక్షాబంధన్‌ ఒకటి. స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ రక్షాబంధన్‌ను పురస్కరించుకుని అక్కాచెల్లెళ్ల స్వేచ్ఛా జీవితానికి రక్షాకవచంగా ఉంటామని భరోసా ఇవ్వాల్సిన తరుణమిది.

అక్షరాస్యత..


 

దేశ అత్యున్నత పదవి అధిరోహించిన ద్రౌపది ముర్ము ఆడపిల్లకు చదువెందుకనే సంకెళ్లను తెంచుకుని బయటకొచ్చారు. ఇలాంటి బంధనాలు ఇందూరులోని చాలా మంది ఆడపడచులకు ఉంది. అమ్మాయిలకు సరస్వతీ ఎందుకనే సమాజంలో బాల్యంలోనే వివాహాలు చేసేయాలని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మారాలంటే సోదరుడిగా మొదట మనమే అండగా ఉండాలి. అక్క, చెల్లి వెంట నిలిచి చదువుకొనేలా ప్రోత్సహించాలి. ఇంట్లో వారికి నచ్చజెప్పి వారి విద్యోన్నతికి దోహదపడాలి. విద్యావిజ్ఞానమే వారికిచ్చే నిజమైన బహుమానం.


వాక్‌  స్వాతంత్య్రం

ఏం మాట్లాడుతున్నావ్‌... నువ్వో ఆడదానివన్న సంగతి మరిచావా? ఇదీ సమాజంలో స్త్రీలు మాట్లాడితే ఎదురయ్యే ప్రశ్నలు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్‌ పుణ్యమాని స్థానికసంస్థల్లో 50 శాతం  అమలవుతోంది. ప్రజల చేత ఎన్నికైనా.. తమ అధికారాలను వినియోగించుకోలేని పరిస్థితి. అధికారిక హోదాలో ఉన్నా ఏం మాట్లాడాలో నిర్దేశించేది పురుషులే. అందుకే మహిళలు స్వేచ్ఛగా పరిపాలన సాగించడానికి, మాట్లాడటానికి వాక్‌   స్వాతంత్య్రం కల్పించాలి.


ఆర్థిక

పితృస్వామ్య సమాజం కావడంతో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కొరవడుతోంది. స్వయంగా వారు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం అసాధ్యం. కనీసం బీమా సదుపాయమూ వారికి ఉండదు. వారు సంపాదించినా వేతనంపై వారికి అధికారముండదు. ఏదైనా ఒకరి తోడుతో నిర్ణయం తీసుకోవాల్సిందే. ఆర్థిక స్వేచ్ఛను కల్పించాల్సిన తరుణమిది.


సమానత్వం

ద్యోగాలు, రాజకీయాల్లో సమానత్వమన్నది మహిళల విషయంలో నిషేధించిన అంశం. ప్రభుత్వ ఉద్యోగాల్లో మాత్రమే వివక్ష కనిపించదు. కానీ పనిచేసే స్థలంలో మాత్రం సమానంగా చూడరు. ఇతర రంగాల్లో స్త్రీలకు సరిపోలదని నియామకాలకు తిరస్కరిస్తారు. వ్యవసాయ, నిర్మాణ రంగాల్లో కూలీలకు వేతనాల్లో వివక్ష కనిపిస్తుంటుంది. ఇటీవల కాలంలో వస్తున్న కొన్ని అధ్యయనాలు, ఫలితాలతో ప్రాధాన్యం పెరుగుతున్నా... ఇంకా రెట్టింపు కావాల్సిన అవసరముంది.


ఆరోగ్యం ..

తివలకు ఆరోగ్యస్వేచ్ఛ లేదు. వారి అనారోగ్యంపై ఎక్కడా నోరు విప్పలేని పరిస్థితి. ఇలాంటి దుస్థితి మారాలి. ఆరోగ్యపరమైన అంశాల్లోనూ సోదరుడిగా వారి అవసరాలను గుర్తించగలగాలి. సకాలంలో గుర్తించి చికిత్స అందించగలిగితే గర్భాశయ, రొమ్ము క్యాన్సర్‌ వంటివి దరిచేరకుండా చూడొచ్చు. సరైన అవగాహన లేక పోషకాహార లేమి ఇతర గృహహింసకు సంబంధించిన విషయాలు చెప్పుకోలేక శారీరక, మానసిక క్షోభకు గురవుతున్నారు. స్వేచ్ఛగా సమస్యలు చెప్పుకొనే వాతావరణం కల్పించాలి. సోదరులుగా భరోసానివ్వాలి.


అర్ధరాత్రి అభయం

గలే గడపదాటి బయటకు వెళ్తే ఇంటికొచ్చే వరకు భరోసా లేదని చాలా మంది తల్లిదండ్రులు, అమ్మాయిలు భయాందోళనలో ఉంటున్నారు. మహిళల విషయంలో దృష్టి కోణం మారాల్సిన అవసరముంది. ప్రేమ, తమ వాంఛల కోసం వారిని బలి చేయొద్దు. అదే స్థానంలో మన తోబుట్టువే ఉంటే మనమేం చేస్తామో.. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా నడిరోడ్డుపై తిరగగలిగిననాడే నిజమైన స్వాతంత్య్రం సిద్ధించినట్లు అని గాంధీ అన్న మాటను నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఏ సమయంలో గడప దాటినా ఆడపడచు సురక్షితంగా ఇంటికి చేరుకుంటుందనే భరోసా కల్పించాలి.


ఆలోచనల్లో..

డదానివి నీకేం తెలుసు... ఇదీ దాదాపు అందరి ఇళ్లలో అనే మాట. ఇల్లు, సామాజిక అంశాల్లో తమ ఆలోచనలను పంచుకోవడానికి స్వేచ్ఛ లేదు. కనీసం వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి స్వేచ్ఛ లేదు. పసిప్రాయం నుంచే వారి కలల ప్రపంచానికి ఆడపిల్లవంటూ సంకెళ్లు వేస్తున్నారు. అలా కాకుండా వారికి అండగా ఉంటే.. పర్వతమంత ఎత్తుకు ఎదుగుతారని మలావత్‌ పూర్ణ, యెండల సౌందర్య, సౌమ్య, నిఖత్‌ జరీన్‌ వంటి వారు నిరూపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని