logo

బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు వినతి

సమాజంలో అధిక జనాభా ఉన్న వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని ఆ సామాజికవర్గం నాయకులు కోరారు. దిల్లీలో గురువారం కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌మెగ్వాల్క్‌ు ఈ మేరకు వినతి పత్రం

Published : 12 Aug 2022 03:23 IST

కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌మెగ్వాల్‌కు వినతి ఇస్తున్న జిల్లా నాయకులు

బోధన్‌, న్యూస్‌టుడే: సమాజంలో అధిక జనాభా ఉన్న వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని ఆ సామాజికవర్గం నాయకులు కోరారు. దిల్లీలో గురువారం కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌మెగ్వాల్క్‌ు ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు. ఉద్యోగాల భర్తీలో బీసీలకు తగు రిజర్వేషన్‌ వర్తింపజేయాలని, తమ వర్గం జనాభాను పూర్తిస్థాయిలో లెక్కించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇందుకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి గతంలో కేంద్రానికి పంపిన సంగతి గుర్తుచేశారు. బీసీ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు యెండల ప్రదీప్‌ నాయకత్వంలో మంత్రిని కలిశామని భవానీపేట శ్రీనివాస్‌, సురేష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని