logo

పొయ్యి వెలగట్లే..

నిజామాబాద్‌ అర్బన్‌లో రేషన్‌ దుకాణాలకు పూర్తిస్థాయిలో బియ్యం కోటా అందక కార్డుదారులు అవస్థలు పడుతున్నారు. మొత్తం 87 షాపులు ఉండగా.. ఇంకా 47 దుకాణాలకు కోటా రాకపోవడం గమనార్హం. పలుచోట్ల మూసి ఉన్న దుకాణాలను చూసి

Published : 12 Aug 2022 03:23 IST

అరకొరగా రేషన్‌ బియ్యం పంపిణీ
అర్బన్‌లో కార్డుదారులకు తప్పని తిప్పలు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నగరం

నగరంలోని జెండాగల్లిలో మూసి ఉన్న రేషన్‌ దుకాణం

నిజామాబాద్‌ అర్బన్‌లో రేషన్‌ దుకాణాలకు పూర్తిస్థాయిలో బియ్యం కోటా అందక కార్డుదారులు అవస్థలు పడుతున్నారు. మొత్తం 87 షాపులు ఉండగా.. ఇంకా 47 దుకాణాలకు కోటా రాకపోవడం గమనార్హం. పలుచోట్ల మూసి ఉన్న దుకాణాలను చూసి కార్డుదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలలో ఒక్కో సభ్యుడికి 15 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది.

ప్రతినెలా ఆలస్యం
ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి లారీలో బియ్యంను రేషన్‌ దుకాణాలకు పంపిస్తారు. సకాలంలో సరకు రాకపోవడంతో అవి మూసి ఉంటున్నాయి. ప్రతినెల ఆలస్యంగా వస్తుండటంతో డీలర్లకు తలనొప్పిగా మారింది. గ్రామాలకు సరఫరా సక్రమంగానే ఉంటోంది. అర్బన్‌లో కార్డుదారులు ఎక్కువగా ఉండటంతో సమస్య ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 20 వరకు..
- చంద్రప్రకాశ్‌, జిల్లా పౌర సరఫరాల అధికారి

ప్రతినెల బియ్యం పంపిణీ 1వ తేదీ నుంచి 15 లోపు మాత్రమే ఉంటుంది. అర్బన్‌లో ఇంకా కోటా సరఫరా కానుందన ఈ నెల 20 వరకు రేషన్‌ దుకాణాల్లో బియ్యం ఇవ్వనున్నాం. కార్డుదారులు ఆందోళన చెందాల్సిన పని లేదు. త్వరలోనే అన్ని దుకాణాలకు బియ్యం పంపేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు