logo

అంతర్జాల మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ మోసాల పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని పోలీసు కమిషనర్‌ నాగరాజు సూచించారు. సైబర్‌ కాంగ్రెస్‌ గ్రాండ్‌ ఫినాలే ముగింపు కార్యక్రమాన్ని గురువారం నిజామాబాద్‌లోని నూతన అంబేడ్కర్‌ భవన్‌లో

Published : 12 Aug 2022 03:23 IST

 ముగిసిన సైబర్‌ కాంగ్రెస్‌ గ్రాండ్‌ ఫినాలే 

జ్యోతి వెలిగిస్తున్న సీపీ నాగరాజు, అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్‌

ఇందూరు సిటీ, న్యూస్‌టుడే: సైబర్‌ మోసాల పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని పోలీసు కమిషనర్‌ నాగరాజు సూచించారు. సైబర్‌ కాంగ్రెస్‌ గ్రాండ్‌ ఫినాలే ముగింపు కార్యక్రమాన్ని గురువారం నిజామాబాద్‌లోని నూతన అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించారు. సీపీతోపాటు అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్‌, డీఈవో దుర్గాప్రసాద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖ సహకారంతో గడిచిన 10 నెలల్లో విద్యార్థులు 100, ఉపాధ్యాయులు 50 మందికి అంతర్జాల మోసాలను ఎదుర్కొనేలా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సైబర్‌ అంబాసిడర్స్‌గా శిక్షణ పొందిన వారంతా మిగతా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా నోడల్‌ అధికారి వనిత, ఎస్బీ ఎస్సై సంతోష్‌కుమార్‌, ఎస్సైలు రషీద్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, విఠల్‌రావు, సిబ్బంది రేఖారాణి, హరితరాణి, నాగరాజు, విఘ్నేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని