logo

చూడ ముచ్చటైన రాఖీ పుష్పాలు

అరే చూడముచ్చటగా ఉన్న ఈ రాఖీలు మొక్కలకు కాశాయేంటని అనుకుంటున్నారా.. వీటి శాస్త్రీయ నాయం ఫాసీ ఫ్లోరా. ఇది లాటిన్‌ పదం. ప్రపంచవ్యాప్తంగా బ్లూఫ్యాషన్‌ ఫ్లవర్‌గా పేర్కొంటే.. జపాన్‌లో క్లాక్‌ ఫ్లవర్‌(గడియార

Published : 12 Aug 2022 03:23 IST

ఈనాడు, నిజామాబాద్‌: అరే చూడముచ్చటగా ఉన్న ఈ రాఖీలు మొక్కలకు కాశాయేంటని అనుకుంటున్నారా.. వీటి శాస్త్రీయ నాయం ఫాసీ ఫ్లోరా. ఇది లాటిన్‌ పదం. ప్రపంచవ్యాప్తంగా బ్లూఫ్యాషన్‌ ఫ్లవర్‌గా పేర్కొంటే.. జపాన్‌లో క్లాక్‌ ఫ్లవర్‌(గడియార పుష్పం), మన దేశంలో కృష్ణ కమలం, రాఖీ ఫుష్పంగా పిలుస్తారు. మహాభారతం కాలం నుంచి దీనికి గుర్తింపు ఉన్నట్లు చెబుతారు. ఈ పుష్పం చుట్టూ ఉన్న రెక్కలను కౌరవులుగా.. ఐదు పసుపు రెక్కలను పాండవులుగా.. మధ్యలోనిది సుదర్శన చక్రంగా అభివర్ణిస్తారు. ఇది జులై - సెప్టెంబరు మధ్య పుష్పిస్తుందని వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు లత వివరించారు. ఈ పుష్పాల సువాసనలు ఒత్తిడి, ఆందోళనలు తగ్గిస్తాయని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని