logo

గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళల అరెస్టు

నిజామాబాద్‌ నగరంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను ఒకటో ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిద్దరి నుంచి 4 కిలోల సరకు స్వాధీనం చేసుకొన్నారు. కమిషనరేట్‌లోని కార్యాలయంలో గురువారం

Published : 12 Aug 2022 03:23 IST

 

 వివరాలు వెల్లడిస్తున్న సీపీ నాగరాజు పక్కన ఏసీపీ వెంకటేశ్వర్‌, ఇతర అధికారులు..

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ నగరంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను ఒకటో ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిద్దరి నుంచి 4 కిలోల సరకు స్వాధీనం చేసుకొన్నారు. కమిషనరేట్‌లోని కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ఆరె వెంకటేశ్వర్‌తో కలిసి సీపీ నాగరాజు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. నిజామాబాద్‌ ఆర్టీసీ బస్టాండులో ఇద్దరు మహిళలు బుధవారం ఉదయం అనుమానాస్పదంగా సంచరించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా బ్యాగుల నుంచి గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. నిందితులిద్దరు ఆదిలాబాద్‌కు చెందిన శాంతాబాయి, కల్పనగా గుర్తించారు. గురువారం కోర్టులో హాజరుపర్చి జ్యుడీషియల్‌ రిమాండుకి తరలించారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఎస్‌హెచ్‌వో విజయ్‌ బాబు, టాస్క్‌ఫోర్స్‌ సీఐ వెంకటేశం, ఎస్సై శ్రవణ్‌, సిబ్బంది నారాయణ, రాజేష్‌, స్వామి, అనిల్‌, భూషణ్‌రాజ్‌ బృందాన్ని సీపీ అభినందించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని