logo

ప్రతి ఇంటిపై జెండా ఎగరాలే

స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా పంద్రాగస్టు రోజున జిల్లావ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని నిజామాబాద్‌ జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఆయా శాఖల అధికారులతో గురువారం సెల్‌

Published : 12 Aug 2022 03:23 IST

నిజామాబాద్‌ కలెక్టరేట్‌: స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా పంద్రాగస్టు రోజున జిల్లావ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని నిజామాబాద్‌ జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఆయా శాఖల అధికారులతో గురువారం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. జిల్లాలో 4.71 లక్షల గృహాలకు జెండాలు అందించాల్సి ఉన్నందున పంపిణీ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించొద్దని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలన్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. జాతీయ జెండాకు భంగం కలగకుండా చూడాలని చెప్పారు.

16న సామూహిక జాతీయ గీతాలాపన
వజ్రోత్సవాలో భాగంగా ఈ నెల 16న ఉదయం 11.30 కు ప్రతిచోట సామూహిక జాతీయ గీతాలాపన చేసేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్‌ కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలు, కార్యాలయాలు, ప్రధాన చౌరస్తాల్లో గీతాలాపన చేపట్టాలన్నారు. వీసీలో అదనపు పాలనాధికారులు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు