logo

17న జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఎంపికలు

కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 17న జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌

Published : 12 Aug 2022 03:23 IST

కామారెడ్డి క్రీడావిభాగం, న్యూస్‌టుడే: కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 17న జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్‌-14, 16, 18, 20 విభాగాలకు చెందిన బాలబాలికలకు రన్స్‌, త్రోస్‌, జంప్స్‌ అంశాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పాల్గొనే క్రీడాకారులు 2002 సెప్టెంబరు 8 నుంచి 2010 సెప్టెంబరు 7 మధ్యలో జన్మించి ఉండాలని తెలిపారు. వయస్సు ధ్రువీకరణ, పదో తరగతి మార్కుల మెమో జిరాక్సులు వెంట తెచ్చుకోవాలని సూచించారు. క్రీడాకారులు ఉదయం 8 గంటల వరకు స్టేడియానికి చేరుకోవాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని