logo

ముగ్గురు విలేకర్లపై కేసు

ఎల్లారెడ్డి తహసీల్దారు సుధాకర్‌ను బెదిరింపులకు గురి చేసిన కేసులో ముగ్గురు ఎలక్ట్రానిక్‌ మీడియా విలేకరులు బాలరాజు, శంభులింగం, పృథ్వీపై ఎల్లారెడ్డి ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

Published : 13 Aug 2022 06:28 IST

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: ఎల్లారెడ్డి తహసీల్దారు సుధాకర్‌ను బెదిరింపులకు గురి చేసిన కేసులో ముగ్గురు ఎలక్ట్రానిక్‌ మీడియా విలేకరులు బాలరాజు, శంభులింగం, పృథ్వీపై ఎల్లారెడ్డి ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవలే విధుల్లో చేరిన సుధాకర్‌ కార్యాలయం సమీపంలోని రెవెన్యూ అతిథిగృహంలో ఉంటున్నారు. గురువారం విధులు ముగించుకొని సేదతీరుతుండగా ముగ్గురు విలేకరులు అనుమతిలేకుండా పడక గదిలోకి ప్రవేశించి మద్యం తాగుతున్నావని నానా హడావుడి చేశారు. ఆయన ముందు మద్యం సీసా, గ్లాసులు పెట్టి వీడియోలు, ఫొటోలు తీశారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టకుండా ఉండాలంటే రూ.లక్ష నగదు ముట్టజెప్పాలంటూ డిమాండ్‌ చేసినట్లు తహసీల్దారు ఫిర్యాదు చేశారన్నారు.  

కఠిన చర్యలకు ఆదేశాలు
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. అధికారులను భయాందోళనలకు గురిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలోనే నిందితులను అరెస్ట్‌ చేయనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని