logo

14న దుబాయ్‌లో అలాయ్‌బలాయ్‌

ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన వలస కార్మికులను కలవడానికి తమ పార్టీ రాష్ట్ర అధినేత డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఈ నెల 14న వెళుతున్నారని బీఎస్పీ జిల్లా కోశాధికారి గణేష్‌ తెలిపారు.

Published : 13 Aug 2022 06:31 IST

గోడప్రతులు విడుదల చేస్తున్న బీఎస్పీ నాయకులు

బోధన్‌, న్యూస్‌టుడే: ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన వలస కార్మికులను కలవడానికి తమ పార్టీ రాష్ట్ర అధినేత డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఈ నెల 14న వెళుతున్నారని బీఎస్పీ జిల్లా కోశాధికారి గణేష్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన గోడప్రతులను శుక్రవారం బోధన్‌లో విడుదల చేసిన ఆయన మాట్లాడారు. తెలంగాణ వస్తే ముంబయి, దుబాయి, బొగ్గుబాయి ఉండవని ప్రాసతో ఉపన్యాసాలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో వలసలు పెరిగాయన్నారు. కుటుంబ పోషణ కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లి  కష్టాలపాలవుతున్నారన్నారు. వలస వెళ్లిన వారికి భరోసా కల్పించడానికి అలాయ్‌బలాయ్‌ ఏర్పాటు చేశారన్నారు. సింగడి పాండే, రాంచంద్ర,  అవినాష్‌ తదితరులు ఉన్నారు.

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts