logo

‘తెరాసతోనే అభివృద్ధి సాధ్యం’

సంక్షేమమే ధ్యేయంగా సర్కారు పని చేస్తోందని, తెరాసతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే షకీల్‌ పేర్కొన్నారు. రాంపూర్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరై మాట్లాడారు.

Published : 15 Aug 2022 06:01 IST


తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే షకీల్‌

నవీపేట, బోధన్‌, న్యూస్‌టుడే: సంక్షేమమే ధ్యేయంగా సర్కారు పని చేస్తోందని, తెరాసతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే షకీల్‌ పేర్కొన్నారు. రాంపూర్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరై మాట్లాడారు. ఫతేనగర్‌లో మాజీ సైనికోద్యోగులకు చెందిన భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు త్వరలో ఇప్పించకపోతే భవిష్యత్తులో ఓట్లు అడగని ఎమ్మెల్యే చెప్పారు. నవీపేట-రాంపూర్‌ మధ్య రెండు వరుసల రహదారి నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. యువజన విభాగం అధ్యక్షుడు సాయికుమార్‌గౌడ్‌ భారీ గజమాలతో షకీల్‌ను సన్మానించారు. పార్టీ రాష్ట్ర నాయకులు రాంకిషన్‌రావు, ఎంపీపీ శ్రీనివాస్‌, జడ్పీటీసీ సభ్యురాలు సవిత, వైస్‌ ఎంపీపీ హరీశ్‌, సర్పంచులు రుతుకల్పన, ఆసిఫాఖాతూన్‌, తెరాస మండలాధ్యక్షుడు నర్సింగ్‌రావు, ఎంపీటీసీ సభ్యురాలు లావణ్య, మీనా, సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు అబ్బన్న, ప్రవీణ్‌ పాల్గొన్నారు. 

బోధన్‌లో చారిత్రక శివాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం భోజనశాల నిర్మాణానికి తన నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయిస్తున్నట్టు ఎమ్మెల్యే షకీల్‌ తెలిపారు. గతంలో ఇచ్చిన రూ.25 లక్షల పనులు మరోసారి టెండరు నిర్వహించి ప్రారంభిస్తామన్నారు. గోశాల అభివృద్ధికి తాను రూ.5 లక్షలు ఇచ్చానని దాతలు ముందుకొచ్చి కమిటీకి సహకరించాలని కోరారు. ఏసీపీ రామారావు, పుర ఛైర్‌పర్సన్‌ పద్మ, రాధాకృష్ణ, గిర్దావర్‌ గంగారెడ్డి, శరత్‌రెడ్డి ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని