logo

ఎస్సారెస్పీ ఆరు గేట్ల ఎత్తివేత

ఎస్సారెస్పీకి ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఆదివారం రాత్రి 9.15 గంటలకు ఆరు వరద గేట్లు ఎత్తారు. నదిలోకి 16,656 క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల చేస్తున్నారు. వరద కాల్వకు నీటి విడుదల నిలిపి వేశారు.

Published : 15 Aug 2022 05:41 IST

శ్రీరామసాగర్‌, న్యూస్‌టుడే: ఎస్సారెస్పీకి ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఆదివారం రాత్రి 9.15 గంటలకు ఆరు వరద గేట్లు ఎత్తారు. నదిలోకి 16,656 క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల చేస్తున్నారు. వరద కాల్వకు నీటి విడుదల నిలిపి వేశారు. ఎగువ నుంచి 17,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.  ఎస్కేప్‌ గేట్ల ద్వారా 5000, కాకతీయ కాల్వకు 3000, లక్ష్మి కాల్వకు 200, సరస్వతి కాల్వకు 300 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని