logo

నిజాంసాగర్‌ నీటి విడుదల

ఎగువ నుంచి నిజాంసాగర్‌లోకి వరద వస్తుండటంతో ఒక గేటు ఎత్తి మంజీరలోకి విడుదల చేసినట్లు జలవనరులశాఖ ఏఈఈ శివప్రసాద్‌ తెలిపారు.

Published : 15 Aug 2022 05:41 IST

నిజాంసాగర్‌, న్యూస్‌టుడే: ఎగువ నుంచి నిజాంసాగర్‌లోకి వరద వస్తుండటంతో ఒక గేటు ఎత్తి మంజీరలోకి విడుదల చేసినట్లు జలవనరులశాఖ ఏఈఈ శివప్రసాద్‌ తెలిపారు. ఆదివారం సాయంత్రం సాగర్‌లోకి 5,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, దిగువకు 4000 క్యూసెక్కులు, జలవిద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 800 క్యూసెక్కులను ప్రధాన కాలువలోకి వదులుతున్నట్లు చెప్పారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1404 అడుగుల(16.357 టీఎంసీలు) నిల్వ ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని