logo

నిజామాబాద్‌ రీజియన్‌కు త్వరలో కొత్త బస్సులు

రానున్న మూడు నెలల్లో నిజామాబాద్‌ రీజియన్‌కు కొత్త బస్సులు వచ్చే అవకాశం ఉందని ఎండీ సజ్జనార్‌ తెలిపారు. హైదరాబాద్‌లో తన కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగి వికాస్‌ చౌదరి వివాహ వేడుక కోసం ఆదివారం ఆయన జిల్లాకు వచ్చారు.

Published : 15 Aug 2022 06:01 IST


డిపో-1లో మొక్క నాటుతున్న సజ్జనార్‌

నిజామాబాద్‌ అర్బన్‌, బోధన్‌, న్యూస్‌టుడే: రానున్న మూడు నెలల్లో నిజామాబాద్‌ రీజియన్‌కు కొత్త బస్సులు వచ్చే అవకాశం ఉందని ఎండీ సజ్జనార్‌ తెలిపారు. హైదరాబాద్‌లో తన కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగి వికాస్‌ చౌదరి వివాహ వేడుక కోసం ఆదివారం ఆయన జిల్లాకు వచ్చారు. అనంతరం నిజామాబాద్‌, బోధన్‌ ప్రయాణ ప్రాంగణాలను పరిశీలించారు. వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలో మూడు రోజులు ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముగ్గురు స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించనున్నట్లు పేర్కొన్నారు. రాఖీ పండుగకు రూ.20.11 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. బస్సు ట్రాకింగ్‌ పద్ధతిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. కామారెడ్డి, బోధన్‌, హైదరాబాద్‌ మార్గాల్లో ఆదరణ బాగుందన్నారు. బోధన్‌ బస్టాండుకు ప్రహరీ నిర్మించాలని డీఎం స్వామి విన్నవించారు. ఆర్‌ఎం ఉషాదేవి, డిప్యూటీ రీజనల్‌ మేనేజర్‌ శంకర్‌, డిపో-1 డీఎం కృష్ణ, డిపో-2 డీఎం వెంకటేశం, పీవో శ్రీనివాస్‌రావు, ఏఓ సుధాకర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని