logo

ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపిక

ఆర్ముడ్‌ రిజర్వ్‌ విభాగంలో అసిస్టెంట్‌ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న నీలంరెడ్డిని వజ్రోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపిక చేసింది.

Published : 15 Aug 2022 06:01 IST


ఏఆర్‌ ఎస్సై నీలంరెడ్డి

కామారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: ఆర్ముడ్‌ రిజర్వ్‌ విభాగంలో అసిస్టెంట్‌ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న నీలంరెడ్డిని వజ్రోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపిక చేసింది. 1990లో ఏఆర్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన ఆయన 2012లో హెడ్‌కానిస్టేబుల్‌, 2019లో ఏఆర్‌ ఎస్సైగా పదోన్నతి పొందారు. జిల్లా సాయుధ విభాగంలో పనిచేస్తున్న నీలంరెడ్డి సేవలను గుర్తిస్తూ పురస్కారానికి ఎంపిక చేయడం పట్ల ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని