logo

వేడుకలకు ఏర్పాట్లు

స్వాతంత్య్ర దిన వేడుకలకు ఇందిరాగాంధీ స్టేడియం ముస్తాబైంది. వజ్రోత్సవాల నేపథ్యంలో అన్ని శాఖలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి. ప్రధాన వేదికతో పాటు ప్రజలు, పురప్రముఖులు కూర్చోవడానికి గ్యాలరీని అలంకరించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు.

Updated : 15 Aug 2022 06:29 IST


ఇందిరా గాంధీ స్టేడియంలో ప్రధాన వేదిక, గ్యాలరీలను ముస్తాబు చేస్తున్న సిబ్బంది

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర దిన వేడుకలకు ఇందిరాగాంధీ స్టేడియం ముస్తాబైంది. వజ్రోత్సవాల నేపథ్యంలో అన్ని శాఖలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి. ప్రధాన వేదికతో పాటు ప్రజలు, పురప్రముఖులు కూర్చోవడానికి గ్యాలరీని అలంకరించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలు తెలిపే విధంగా శకటాల ప్రదర్శనకు దారి ఏర్పాటు చేశారు. పోలీసుల కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి వర్షం కారణంగా ఏర్పాట్లకు అంతరాయం కలిగింది.

షెడ్యూల్‌ ఇదీ..
స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 10.10 నుంచి కార్యక్రమాలు ముగిసే  వరకు ఉంటారు.
* ఉదయం 10.24 గంటలకు కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ వేదిక వద్దకు చేరుకుంటారు. ఆయనకు ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి స్వాగతం పలుకుతారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు.  
* 10.28 గంటలకు ముఖ్యఅతిథిగా సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేరుకుంటారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, అదనపు కలెక్టర్లు ఆయనకు స్వాగతం పలుకుతారు. 10.30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయగీతం ఆలపిస్తారు.
* 10.35 గంటలకు పోలీసుల గౌరవ వందనం అందుకొని, 10.40కి జిల్లా ప్రగతిపథంపై ఉపన్యసిస్తారు. - ఆ తర్వాత శకటాల ప్రదర్శన, స్టాళ్ల పరిశీలన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని