logo
Published : 17 Aug 2022 02:46 IST

పరిశ్రమకు దక్కని రాయితీ

 ఆరేళ్లలో బకాయిలు రూ.99.29 కోట్లు

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇస్తామని పేర్కొంది. దరఖాస్తులు, అనుమతుల విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. టీఎస్‌ఐపాస్‌ విధానం ద్వారా సులువుగా అనుమతులు ఇచ్చింది. ఫలితంగా ఔత్సాహికులు జిల్లాలో అనేక యూనిట్లు నెలకొల్పారు. ఇంత వరకు బాగానే ఉన్నా రాయితీ బకాయిలు సకాలంలో విడుదల చేయడం లేదు. ఇది వాటి నిర్వహణకు ప్రతిబంధకంగా మారింది. విద్యుత్తు ఛార్జీలు పెరగడంతో కొన్ని పరిశ్రమలను మూసి వేసే పరిస్థితి ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా ఆరేళ్లలో రూ.99.29 కోట్ల రాయితీ బకాయిలు రావల్సి ఉండటం గమనార్హం.

ఊతం అవే..

పరిశ్రమలకు ప్రభుత్వం అందించే రాయితీలతో ఊతం లభిస్తుంది. వ్యాపారవేత్తలకు మరింత ప్రోత్సాహం ఉంటుంది. జిల్లాలో 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 351 యూనిట్లు నెలకొల్పారు. వీటి ఏర్పాటుతో వందలాది మందికి ఉపాధి లభిస్తోంది. ఏటా ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పెట్టుబడి మూలధనం, విద్యుత్తు, పన్నుల మినహాయింపు, పావలావడ్డీ వంటి అంశాల్లో ప్రభుత్వం రాయితీ నగదు ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని విడుదల చేయకపోవడం వల్ల నిర్వాహకులు డీలా పడిపోతున్నారు. ఈ ప్రభావం కొత్తవాటి ఏర్పాటుపై పడుతోంది. ఔత్సాహికులు నూతన యూనిట్లు నెలకొల్పేందుకు వెనుకంజ వేస్తున్నారు. గత ఆరేళ్లలో ఒకటి, రెండుసార్లు చిన్నమొత్తంలోనే జమ చేయడం గమనార్హం.


విడుదల కాగానే జమ

పరిశ్రమలకు అందాల్సిన రాయితీ బకాయిలను ప్రభుత్వం ఇప్పటి వరకు ఒకటి, రెండుసార్లు విడుదల చేసింది. వాటిని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. మిగతావి ఎప్పుడు విడుదల అయితే అప్పుడు ఇస్తాం.

- లాలూనాయక్‌, జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్‌, కామారెడ్డి

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని