logo

న్యాయవాదుల విధుల బహిష్కరణ

న్యాయవాదుల రక్షణ, సంక్షేమంపై చట్టాలు తేవాలనే డిమాండ్‌తో మూడు రోజుల పాటు విధులు బహిష్కరిస్తున్నట్లు నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎర్రం గణపతి తెలిపారు. మంగళవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండకు చెందిన న్యాయవాది

Published : 17 Aug 2022 02:46 IST

నిజామాబాద్‌లో మాట్లాడుతున్న అధ్యక్షుడు ఎర్రం గణపతి

నిజామాబాద్‌ న్యాయవిభాగం, ఆర్మూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: న్యాయవాదుల రక్షణ, సంక్షేమంపై చట్టాలు తేవాలనే డిమాండ్‌తో మూడు రోజుల పాటు విధులు బహిష్కరిస్తున్నట్లు నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎర్రం గణపతి తెలిపారు. మంగళవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండకు చెందిన న్యాయవాది విజయ్‌రెడ్డి హత్యను ఖండించారు. న్యాయవాదుల రక్షణ చట్టం గురించి తుల గంగాధర్‌, గోవర్ధన్‌, శ్రీధర్‌, కిరణ్‌కుమార్‌గౌడ్‌, ఖాసీం, భాస్కర్‌, శంకర్‌, విఘ్నేశ్‌వారి సూచనలు అందించారు. కార్యదర్శి నరేందర్‌రెడ్డి, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు రాజేందర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు రాజారెడ్డి పాల్గొన్నారు. ఆర్మూర్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలోనూ సమావేశమై విజయ్‌రెడ్డికి నివాళులర్పించారు. బుధవారం రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గంట విప్లవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. అనంతరం సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. తులసీదాస్‌, జగదీశ్‌, కృష్ణంరాజు, గంగాధర్‌, షిండే, రాజేశ్వర్‌, పోచన్న, జీవన్‌, ప్రవీణ్‌, కిష్టయ్య, పవన్‌, అరుణ్‌, జీజీరాం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని