logo
Published : 17 Aug 2022 02:46 IST

అక్రమ నిర్మాణం కూల్చివేత

ఆర్మూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో జలవనరుల శాఖ స్థలాన్ని కొందరు కబ్జా చేసి నిర్మాణం చేపడుతున్నట్లు గుర్తించిన అధికారులు ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్వే నంబరు 401/66లో అక్రమంగా ప్రహరీ నిర్మించేందుకు సామగ్రి తీసుకొచ్చారు. మంగళవారం జలవనరులు, బల్దియా, రెవెన్యూ అధికారులు స్థలాన్ని పరిశీలించి నిర్మాణాన్ని కూల్చివేశారు. జలవనరుల శాఖ డీఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఇక్కడ ఎవరు నిర్మాణాలు చేపట్టినా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. త్వరలో ప్రహరీ నిర్మిస్తామన్నారు. పుర కమిషనర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌, తహసీల్దార్‌ వేణుగోపాల్‌, సర్వేయర్‌ రాజు, పట్టణ ప్రణాళిక అధికారులు హరీశ్‌, వినీత్‌ ఉన్నారు.

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని