logo

‘రైతుల గోడు పట్టదా..!’

జిల్లాలో ధరణి సమస్యలతో ఎంతో మంది రైతులు సతమతమవుతుంటే కలెక్టర్‌కు పట్టడం లేదని భాజపా అసెంబ్లీ ఇన్‌ఛార్జి వెంకటరమణారెడ్డి విమర్శించారు. జిల్లాకేంద్రంలో ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో రోజు నిరాహార దీక్ష చేపట్టారు. పలువురు బాధితులు వచ్చి

Published : 26 Sep 2022 02:27 IST

దీక్షా శిబిరంలో ప్రజల సమస్యలు ఆలకిస్తున్న భాజపా అసెంబ్లీ ఇన్‌ఛార్జి వెంకటరమణారెడ్డి

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో ధరణి సమస్యలతో ఎంతో మంది రైతులు సతమతమవుతుంటే కలెక్టర్‌కు పట్టడం లేదని భాజపా అసెంబ్లీ ఇన్‌ఛార్జి వెంకటరమణారెడ్డి విమర్శించారు. జిల్లాకేంద్రంలో ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో రోజు నిరాహార దీక్ష చేపట్టారు. పలువురు బాధితులు వచ్చి సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేలాది మంది వచ్చి తమ గోడు వెల్లబోసుకుంటున్నారన్నారు. కలెక్టరేట్‌కు విన్నవించినా ఫలితం దక్కడంలేదని చెబుతున్నారన్నారు. మంగళవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్‌రావు, లక్ష్మారెడ్డి, రమేశ్‌, రాజు, గోవింద్‌, నర్సింహారెడ్డి, వెంకట్‌రెడ్డి, ప్రవీణ్‌, గంగాధర్‌, రవి, శ్రీకాంత్‌, అరుణ్‌, రాజాగౌడ్‌, గోపాల్‌, అమృతరావు, నరేందర్‌ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని