logo

భాజపా ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి

జిల్లా కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ

Updated : 26 Sep 2022 16:25 IST

కామారెడ్డి పట్టణం : జిల్లా కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఆర్‌అండ్‌ బీ అతిథి గృహం ఎదుట భాజపా అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌ వెంకటరమణారెడ్డి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఐలమ్మ  పోరాటం  చేసిందన్నారు. ఆమె పోరాట పటిమను నేటి తెలంగాణ యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా ఫ్లోర్‌ లీడర్‌ శ్రీకాంత్‌, కౌన్సిలర్లు శ్రీనివాస్‌, మానస, నాయకులు భరత్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని