అరవై ఏళ్ల వయసులో వరుస హత్యలు

డబ్బుల కోసం ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా హత్యలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని నిజామాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని నాగారానికి చెందిన అల్లెపు మల్లయ్య అలియాస్‌ రాజు అరవై ఏళ్ల వయసులో

Updated : 27 Sep 2022 06:14 IST

ఘరానా హంతకుడి అరెస్టు


వివరాలు వెల్లడిస్తున్న సీపీ నాగారాజు, చిత్రంలో ఏసీపీ, సీఐలు, ఎస్సైలు

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: డబ్బుల కోసం ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా హత్యలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని నిజామాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని నాగారానికి చెందిన అల్లెపు మల్లయ్య అలియాస్‌ రాజు అరవై ఏళ్ల వయసులో వరుస హత్యలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఇతనిపై వివిధ జిల్లాల్లో 16 కేసులు నమోదై ఉన్నాయి. కమిషనరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ నాగరాజు వివరాలు వెల్లడించారు.

* మల్లయ్య కొంతకాలంగా దొంగతనాలు, హత్యలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డితోపాటు నిజామాబాద్‌లో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆగస్టు 24న మాక్లూర్‌ మండలం డీకంపల్లి వద్ద పత్తి లక్ష్మి(56) మృతదేహం లభించింది. చంద్రశేఖర్‌ కాలనీకి చెందిన ఆమె ఆటో ఎక్కిన అనంతరం ఇలా జరిగింది. ఆటో ఆధారంగా మాక్లూర్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా మల్లయ్యతో పాటు అతని అల్లుడు పోశెట్టిని నిందితులుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా మల్లయ్య పాత నేరస్థుడిగా తేలింది. 2019లో జక్రాన్‌పల్లిలో ఓ మహిళ తలపై దాడి చేసి నగలు అపహరించుకెళ్లాడు. 2020లో ముప్కాల్‌ మండలంలోని పంట పొలంలో ఉన్న మహిళను హత్య చేసి నగలు దోచుకెళ్లాడు. జులైలో కామారెడ్డి జిల్లా లింగంపేటలో కిరాణా దుకాణంలో ఉన్న మహిళపై దాడి చేసి నగలు ఎత్తుకెళ్లాడు. అతని నుంచి 15 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవటంలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ ఆరె వెంకటేశ్వర్‌ నేతృత్వంలోని సీఐలు రాజశేఖర్‌, నరహరి, ఎస్సైలు యాదగిరిగౌడ్‌, రాజేశ్వర్‌ గౌడ్‌, సిబ్బంది రామకృష్ణ, వేణు, ప్రవీణ్‌, నీలేష్‌, అప్సర్‌ బృందాన్ని సీపీ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని