logo

ప్రత్యామ్నాయ ఆదాయం

ప్రయాణికుల సంక్షేమమే ధ్యేయంగా సేవలందిస్తున్న ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టి పెట్టింది. 2020 జూన్‌ 19న ప్రారంభించిన కార్గో ద్వారా సంస్థకు ఆదాయం సమకూరుతోంది. ఉభయ జిల్లాల్లోని ఆరు డిపోల పరిధిలో రూ.లక్షల్లో

Published : 27 Sep 2022 05:59 IST

ఆర్టీసీకి రెండేళ్లలో రూ.6.72 కోట్ల రాబడి


కామారెడ్డి బస్టాండులో కార్గో కేంద్రం

న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం: ప్రయాణికుల సంక్షేమమే ధ్యేయంగా సేవలందిస్తున్న ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టి పెట్టింది. 2020 జూన్‌ 19న ప్రారంభించిన కార్గో ద్వారా సంస్థకు ఆదాయం సమకూరుతోంది. ఉభయ జిల్లాల్లోని ఆరు డిపోల పరిధిలో రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. ఇటీవల వినూత్న పథకాలతో ఆర్టీసీ ప్రజల ముందుకొస్తోంది. బాలల, మహిళా దినోత్సవం సందర్భంగా ఐదేళ్ల లోపు పిల్లలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించింది. కార్గో ద్వారా బంగినపల్లి మామిడిపండ్లు, భద్రాచలం నుంచి సీతారామ కల్యాణ తలంబ్రాలు సరఫరా చేసింది. ఈ నెల 25 వరకు 5,61,431 పార్సిళ్లు, కొరియర్లు బుక్‌ చేయగా..  రూ.5.80 కోట్ల ఆదాయం సమకూ రింది. ఇక బస్సుల్లో సరకుల రాకపోకలు 1653 నమోదుకాగా..  రూ.92.15 లక్షల ఆదాయం సమకూరిందని  అధికార వర్గాలు వెల్లడించాయి.

తక్కువ ధరలో సేవలు - లక్కు మల్లేశం, డీఎం-కామారెడ్డి

ఆర్టీసీ సంస్థ ప్రవేశపెట్టిన కార్గో  సేవలను ప్రజలు సద్వినియోగం  చేసుకోవాలి. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పారదర్శకమైన సేవలందించేందుకు కృషి చేస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని