logo

ఇక కొత్త మండలాల్లో పాలన

ఉమ్మడి జిల్లాలో నాలుగు కొత్త మండలాలు ఏర్పాటుపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ రెవెన్యూ డివిజన్‌లో డొంకేశ్వర్‌, ఆలూర్‌, బోధన్‌ రెవెన్యూ డివిజన్‌లో సాలూర, కామారెడ్డి జిల్లా బాన్సువాడ

Published : 27 Sep 2022 05:59 IST

ఆలూర్‌, సాలూరలో గ్రామాల మార్పు

ఈనాడు, నిజామాబాద్‌: ఉమ్మడి జిల్లాలో నాలుగు కొత్త మండలాలు ఏర్పాటుపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ రెవెన్యూ డివిజన్‌లో డొంకేశ్వర్‌, ఆలూర్‌, బోధన్‌ రెవెన్యూ డివిజన్‌లో సాలూర, కామారెడ్డి జిల్లా బాన్సువాడ రెవెన్యూ డివిజన్‌లో డోంగ్లిని మండల కేంద్రాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జులై 23న ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆలూర్‌, సాలూర మండలాల పరిధిలో గ్రామాల సంఖ్యలో మార్పులు జరిగాయి. తాజాగా సోమవారం విడుదల చేసిన తుది నోటిఫికేషన్‌లో ఆ వివరాలను వెల్లడించారు. కొత్త మండలాల పాలన వెంటనే ప్రారంభం కానుంది.

ఆలూర్‌..: ఏడు గ్రామాలతో ఆలూర్‌ రెవెన్యూ మండలంగా రూపుదిద్దుకుంది. ఆర్మూర్‌ మండలం నుంచి అయిదు గ్రామాలు మిర్దాపల్లి, దేగాం, మచ్చర్ల, గగ్గుపల్లి, ఆలూర్‌, మాక్లూర్‌ మండలం గుత్ప, కల్లడి గ్రామాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆర్మూర్‌ మండలం రాంపూర్‌, నందిపేట మండలం వన్నెల్‌ (కుర్దు), సిద్ధాపూర్‌లు ఆలూర్‌ మండలంలోకి వెళ్తున్నట్లు ప్రాథమిక నోటిఫికేషన్‌ ఉండగా.. తుది జాబితాలో తొలగించారు.  

డొంకేశ్వర్‌: ప్రాథమిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల్లో ఎలాంటి మార్పు లేదు. నందిపేట మండలం నుంచి 12 గ్రామాలను విభజించి డొంకేశ్వర్‌ పేరిట రెవెన్యూ మండలం ఏర్పాటైంది. డొంకేశ్వర్‌, తొండాకూర్‌, దత్తాపూర్‌, గంగా సముందర్‌, సిర్పూర్‌, అన్నారం, మారంపల్లి, నూత్‌పల్లి, నడ్కుడ, గాదేెపల్లి, కోమట్‌పల్లి, నిఖాల్‌పూర్‌ కొత్త మండలం పరిధిలోకి రానున్నాయి. జనాభా 20,580గా ఉండనుంది.

డోంగ్లి..: మద్నూర్‌ మండలం నుంచి 15 గ్రామాలను విభజించి ఏర్పాటు చేస్తున్న డోంగ్లీ మండలం విషయంలో ఎలాంటి మార్పులు లేవు. మద్నూర్‌ కామారెడ్డి జిల్లాలోనే పెద్ద మండలంగా ఉండటంతో డోంగ్లీ, మొఘ, లింభూర్‌, హసన్‌టాకి¨్ల, పెద్దటాక్లి, సిర్‌పూర్‌, మాదన్‌ హిప్పర్గ, ఇలేగావ్‌, ఎన్‌బుర, కుర్ల, దోతి, మల్లాపూర్‌, లక్ష్మాపూర్‌, మారెపల్లి, చిన్నాపూర్‌ గ్రామాలతో కొత్త మండలం ఏర్పాటు కానుంది. జనాభా 24 వేల వరకు ఉండే వీలుంది.

సాలూర: బోధన్‌ మండలం 43 రెవెన్యూ గ్రామాలతో నిజామాబాద్‌ జిల్లాలో అతి పెద్దదిగా ఉండేది. మంజీర తీరంలోని పదిహేడు గ్రామాలతో సాలూర మండలాన్ని ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించారు. ప్రాథమిక నోటిఫికేషన్‌లో అదే పేర్కొన్నారు. తుది నోటిఫికేషన్‌లో పది గ్రామాలతోనే సరిపెట్టారు. మందర్న, హున్సా, ఖాజాపూర్‌, ఫతేపూర్‌, తగ్గేల్లి, సాలంపాడ్‌, లక్ష్మాపూర్‌(లకంపూర్‌), కొమ్మన్‌పల్లి, జాడీజమాల్‌పూర్‌ గ్రామాలు కొత్త మండలం పరిధిలోకి వస్తాయి. కొత్త మండలం జనాభా 30 వేలుగా పేర్కొన్నప్పటికీ..మార్పు కారణంగా 20 వేలకు పడిపోనుంది.

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts