logo

బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు విస్తరించాలి : ఎంపీ అర్వింద్‌

ప్రైవేటుకు దీటుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు విస్తరించాలని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కోరారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌ అడ్వైజరీ కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 4జీ సేవలు అందుబాటులోకి

Published : 27 Sep 2022 05:59 IST

డ్రోన్‌ గురించి తెలుసుకుంటున్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రైవేటుకు దీటుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు విస్తరించాలని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కోరారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌ అడ్వైజరీ కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 4జీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. 63 గ్రామాల్లో నెట్‌వర్క్‌ సౌకర్యం కల్పించాలని కోరుతూ సంబంధిత కేంద్ర మంత్రికి లేఖ రాస్తానన్నారు. సీజీఎం కేవీఎన్‌రావు, జగ్‌రామ్‌ పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎంపీకి వినతి పత్రం అందించారు.  

నూతన ఆవిష్కరణలకు ఆస్కారం

నిజామాబాద్‌ అర్బన్‌: మోదీ చేయూతనివ్వడంతోనే నూతన ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటున్నాయని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. స్టార్టప్‌ ఇండియాలో భాగంగా వంశీ, మధు రూపొందించిన డ్రోన్‌ను ఆయన పరిశీలించారు. అత్యవసర సమయాల్లో వైద్య సామగ్రిని తీసుకెళ్తుందన్నారు. దీని సాయంతో ప్రయోగాత్మకంగా ఖలీల్‌వాడిలోని ఒక ఆసుపత్రికి మందులు పంపించారు. భాజపా జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్‌ సూర్యనారాయణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని