logo

కమ్మర్‌పల్లికి కొత్తకళ

మండల కేంద్రానికి కొత్తకళ రానుంది. జాతీయ రహదారిపై గల ఈ గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సంకల్పించారు. సెంట్రల్‌ లైటింగ్‌, రోడ్డు డివైడర్‌ ఏర్పాటుకు రూ.5 కోట్ల నిధులు మంజూరు చేశారు.

Published : 27 Sep 2022 05:59 IST

కమ్మర్‌పల్లిలోని 63వ జాతీయ రహదారి

కమ్మర్‌పల్లి, న్యూస్‌టుడే: మండల కేంద్రానికి కొత్తకళ రానుంది. జాతీయ రహదారిపై గల ఈ గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సంకల్పించారు. సెంట్రల్‌ లైటింగ్‌, రోడ్డు డివైడర్‌ ఏర్పాటుకు రూ.5 కోట్ల నిధులు మంజూరు చేశారు. మంగళవారం పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

1200 మీటర్ల పొడవు  : కమ్మర్‌పల్లిలోని 63వ జాతీయ రహదారిపై పోలీసుస్టేషన్‌ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు 1200 మీటర్లు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇరువైపులా 50 అడుగుల పొడవుతో రోడ్డును విస్తరించి మధ్యలో డివైడర్‌ను నిర్మిస్తారు. ఇందులో 33 అడుగుల తారు రోడ్డు, మిగతా 17 అడుగుల మొరం రోడ్డు, డ్రైనేజీ ఉంటుంది. 25 మీటర్లకు ఒక విద్యుత్తు స్తంభం చొప్పున మొత్తం 48 బిగిస్తారు. హాసాకొత్తూర్‌, ఉప్లూర్‌, ఆర్టీసీ బస్టాండ్‌ చౌరస్తా వద్ద యూటర్న్‌లు వచ్చే అవకాశం ఉంది. అత్యవసరమైన చోట రోడ్డు దాటడానికి పాదచారులకు కాలిబాటలు ఏర్పాటు చేయనున్నారు.

డివైడర్‌పై విగ్రహాలు  : రోడ్డు విస్తరణలో భాగంగా అడ్డుగా వచ్చే భరతమాత, జాతీయ, తెలంగాణ ఉద్యమ నాయకుల విగ్రహాలను డివైడర్‌పై ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించనున్నారు. దీని కోసం పెద్దమ్మ ఆలయం వద్ద శిలాఫలకాన్ని నిర్మించారు. పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే శ్రీ కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసి అనంతరం అదే సంఘ భవనంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని