logo

ప్రసవాలు @ 1500

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి మేము వెళ్తాం ఆర్మూర్‌ ప్రాంతీయాసుపత్రికి అన్న రీతిలో ఇక్కడ వైద్య సేవలు మెరుగుపడ్డాయి. వైద్య విధాన పరిషత్‌ అధీనంలో వంద పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడై గర్భిణులు,

Published : 27 Sep 2022 05:59 IST

కాన్పులకు చిరునామా ఆర్మూర్‌ ప్రాంతీయ ఆసుపత్రి

న్యూస్‌టుడే, ఆర్మూర్‌ పట్టణం: నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి మేము వెళ్తాం ఆర్మూర్‌ ప్రాంతీయాసుపత్రికి అన్న రీతిలో ఇక్కడ వైద్య సేవలు మెరుగుపడ్డాయి. వైద్య విధాన పరిషత్‌ అధీనంలో వంద పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడై గర్భిణులు, బాలింతలకు చిరునామాగా మారింది. కాన్పుల కోసం ఆర్మూర్‌తో పాటు చుట్టు పక్కల మండలాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. నిత్యం 100కు పైగా గైనకాలజీ ఓపీ నమోదు అవుతుండటం గమనార్హం. ప్రతిరోజు 10 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ముగ్గురు స్త్రీ వైద్య నిపుణులు, ఒక పిల్లల వైద్యుడు అందుబాటులో ఉండటంతో ప్రసవాల కోసం వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శస్త్రచికిత్సలు తగ్గించి, సాధారణ ప్రసవాలు పెంచాలనే ఉన్నతాధికారుల ఆదేశాలను పక్కాగా పాటిస్తారనే నమ్మకం గర్భిణులను ఇటువైపు అడుగులు వేసేలా చేస్తోంది. అందుకు తగ్గట్లు సాధారణ కాన్పు కోసం వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. క్లిష్ట పరిస్థితులు ఉన్నవారికి మాత్రమే శస్త్రచికిత్సలు చేస్తున్నారు.

మెరుగైన సేవలు అందిస్తున్నాం

గర్భిణులకు, బాలింతలకు ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందిస్తున్నాం. ముగ్గురు గైనకాలజీ వైద్యులు ఉండటంతో అత్యధిక ప్రసవాలు చేస్తున్నాం. మరింత మంది వైద్యులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. దీంతో ప్రజలకు మరింత వెసులుబాటు లభిస్తోంది. ప్రైవేటుకు దీటుగా పరిశుభ్రత, రక్షణ విషయంలో చర్యలు తీసుకుంటున్నాం.- నాగరాజు, సూపరింటెండెంట్‌, ఆర్మూర్‌ ప్రాంతీయాసుపత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని