logo

ఆరోగ్య బతుకమ్మ

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో పాటు ప్రకృతి ప్రతిబింబంగా నిలుస్తోంది బతుకమ్మ సంబురం. దేవున్ని పూజించే పూలనే.. కొలిచే అరుదైన సందర్భమిది. ఇందులో పర్యావరణ పరిరక్షణతోపాటు ఆరోగ్యానికి పనికొచ్చే అంశాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యుడు

Published : 27 Sep 2022 06:06 IST
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం
సాలూరలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో పాటు ప్రకృతి ప్రతిబింబంగా నిలుస్తోంది బతుకమ్మ సంబురం. దేవున్ని పూజించే పూలనే.. కొలిచే అరుదైన సందర్భమిది. ఇందులో పర్యావరణ పరిరక్షణతోపాటు ఆరోగ్యానికి పనికొచ్చే అంశాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యుడు గంగాదాస్‌ పేర్కొన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..

తంగేడు
బతుకమ్మను పేర్చడంలో పవిత్రంగా భావించే అడవి పువ్వు తంగేడు. దీన్ని తెలంగాణ రాష్ట్ర పుష్పంగా గుర్తించారు. సంస్కృతంలో దీన్ని మాయాహరి, చర్మాంగ అని పిలుస్తారు. నీటిఎద్దడిని ఎదుర్కొని బంజర భూముల్లోనూ విస్తారంగా పెరుగుతుంది. బంగారువర్ణంలో ఉండే ఈ పూల అన్ని భాగాలు ఉపయుక్తంగా ఉంటాయి. ముఖ్యంగా మధుమేహాన్ని నియంత్రిస్తుంది. తంగేడు పచ్చివేరు రసం దగ్గును దూరం చేస్తుంది. కాళ్లు, చేతులు విరిగినప్పుడు ఈ ఆకులు ముద్దగా చేసి కట్టుకడితే వాపు, నొప్పులు తగ్గుతాయి.

గునుగు పువ్వు
గునుగు పువ్వులో వివిధ బయోకాంపౌండ్లు, ప్లెటోకెమికల్స్‌ ఉండడంతో కంటిచూపునకు బాగా పనిచేస్తుంది. బీటాకెరోటిన్‌, పోలిక్‌యాసిడ్‌, విటమిన్‌ ఇ, ప్రొటీన్లు ఉంటాయి. నోటిలో వచ్చే పొక్కులు, అల్సర్లు, గాయాలు మానడానికి ఉపకరిస్తుంది.

గుమ్మడిపువ్వు
బతుకమ్మను పేర్చడంలో తొలుత గుమ్మడి పువ్వును ఉంచుతారు. దీని కేసరాలపై పుప్పొడి అధికంగా ఉంటుంది. ఏ, సీ విటమిన్లు ఉంటాయి. కీళ్లనొప్పులను తగ్గించే గుణం ఉంది. చర్మం పొడిబారకుండా ఉంచుతుంది.

సీతమ్మజడ
ఇందులోని పూలరేకులు, గింజలు పక్షులకు ఆహారంగా ఉపయోగపడతాయి. వీటి ఆకులు గాయాలు, నోటిలో పొక్కులను అరికట్టేందుకు సహకరిస్తాయి. అస్తమాను తగ్గించే ఔషధ గుణాలు ఉంటాయి.

గన్నేరు
పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కుష్ఠువ్యాధి నివారణకు దోహదం చేస్తాయి.

బంతి
కిడ్నీలో రాళ్లు కరిగించడంలో, చర్మంపై దద్దులను తగ్గించడంలో సహకరిస్తుంది. పంటి నొప్పి, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

తామర
చర్మవ్యాధులను అరికడుతుంది. ఆయుర్వేద ఔషధాలు, సుగంధ ద్రవ్యాల తయారీలో తామర పువ్వులు, నూనె వాడతారు.

రుద్రాక్షపూలు
వీటి గింజలను కేక్‌, జెల్లీ వంటివి తయారు చేయడంలో వాడతారు. ఈ పువ్వు గింజలతో స్నానం చేస్తే చర్మవ్యాధులు దూరమవుతాయి. పుండ్లను నయం చేస్తుంది.

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని