logo

కల్యాణ లక్ష్మి పథకం.. పేదలకు వరం

కల్యాణ లక్ష్మి పథకం పేదలకు వరంలా మారిందని ఎంపీడీవో భానుప్రకాశ్‌, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్‌ పేర్కొన్నారు

Updated : 27 Sep 2022 15:08 IST

బీర్కూరు : కల్యాణ లక్ష్మి పథకం పేదలకు వరంలా మారిందని ఎంపీడీవో భానుప్రకాశ్‌, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్‌ పేర్కొన్నారు. మండలంలోని తిమ్మాపూర్‌, బీర్కూరు తాండ, మల్లాపూర్‌ గ్రామాల్లో లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లి కోసం ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా ఆర్థిక సహాయం అందిస్తోందని చెప్పారు. మహిళలకు బతుకమ్మ చీరలు, ఆసరా గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రమాకుమారి, దేవీబాయి, ఏపీఎం గంగాధర్‌ యాదవ్‌, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్‌, అనిత పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని